యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ రాష్ట్ర డిజిపి ముదిరెడ్డి మహేందర్ రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల డిజిపిల సమావేశం మంగళవారం తిరుపతిలో జరిగింది. తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి, ఎపి డిజిపి ఆర్.పి.ఠాకూర్ తో పాటు దక్షిణాదికి చెందిన 15 మంది పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం తిరుపతిలోని మానస సరోవర్ హోటల్ లో జరిగింది. తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డితో పాటు వీరు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు, ఎన్నికల సందర్భంగా చేయాల్సిన భద్రత, అంతరాష్ట్ర సమన్వయం, పరస్పర సహకారంపై చర్చించారు.