YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అధికారం మనదే.. అందర్నీ ఆదుకుంటాం ! 'రావాలి జగన్.. కావాలి జగన్'లో మాజీమంత్రి బాలినేని

అధికారం మనదే.. అందర్నీ ఆదుకుంటాం !  'రావాలి జగన్.. కావాలి జగన్'లో మాజీమంత్రి బాలినేని

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రానున్న ఎన్నికల్లో అధికారానికి వచ్చేది మనమే. ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇరుకిళ్లల్లో మగ్గిపోవాల్సిన అవసరం లేదు. అందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక 23వ డివిజన్లోని కోట వీధి, అరవపాలెం, దండుపాలెం, పకీరు పాలెం, గానుగపాలెంలో బాలినేని పర్యటించారు. ఇంటింటికీ తిరిగి నవతర్నాల కరపత్రాలను పంచారు. ఈసందర్భంగా స్థానికులు ఇరుకైన ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నట్లు ఆయన దృ'ష్టికి తీసుకొచ్చారు. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతీ కుటుంబానికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. తెలుగు దేశం సర్కారు మాదిరిగా పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు తాము చేయబోమన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు నేరుగా ఇంటికి తీసుకొచ్చి అందజేసే విధంగా వైఎస్ జగన్ కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు ఎంతయితే అప్పు ఉందో వాళ్ల బ్యాంకు రుణాలన్నింటినీ తీర్చే బాధ్యత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబులాగా ఎన్నికల వేళ జిమ్మిక్కులు చేసే సంస్కృతి తమది కాదన్నారు. ఏదైనా మాట ఇస్తే వెనుతిరిగేది లేదని బాలినేని హామీనిచ్చారు. తొలుత కోట వీధిలో ఒంగోలు బాసు.. బాలినేని వాసంటూ అభిమానులు ఆయన్ని పైకి ఎత్తుకొని తీసుకెళ్లారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, డివిజన్ అధ్యక్షుడు కృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్, మైనార్టీ సెల్ నాయకులు షేక్ ఇంతెజార్, సయ్యద్ జలీల్, షేక్ అబ్దుల్లా, మహిళా నాయకులు పల్లా అనురాధ, రమణ పాల్గొన్నారు.

Related Posts