Highlights
- కమల్ ను స్కూలుకు రానివ్వం
- కలెక్టరుకు ఫిర్యాదు

ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టక ముందే కష్టాలు మొదలయ్యాయి. తమిళనాడు రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి క్రియాశీలకంగా మారనున్న కమల్‌హాసన్‌కు ఆంక్షలతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అప్పుడే చిక్కులు మొదలయ్యాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జన్మించిన రామేశ్వరం నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాలని కమల్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం ఇక్కడ నుంచే పార్టీని ప్రకటించి పూర్తి స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు. అయితే పాఠశాలను సందర్శించడానికి వీల్లేదంటూ తమిళనాడులోని హిందూ మున్నానీ అనే హిందూ సంస్థ డిమాండ్ చేసింది. అంతేకాకుండా కమల్‌ను అక్కడికి రాకుండా నిలువరించాలని ఆ సంస్థ జిల్లా విభాగ అధ్యక్షుడు కలెక్టర్‌ను వారు కోరారు.