యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. పిచ్‌ను పొట్టి క్రికెట్ కోసమే రూపొందించినట్టు చాలా బాగుంది. బంతులు బ్యాటు మీదకు రావడంతో కివీస్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (84; 43 బంతుల్లో 7×4, 6×6), కొలిన్ మన్రో (34; 20 బంతుల్లో 2×4, 2×6) విధ్వంసం సృష్టించారు. ఆతిథ్య జట్టు భారత్‌కు 220 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.