YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుప్రీం తీర్పును అమలు చేయాల్సిందే

సుప్రీం తీర్పును అమలు చేయాల్సిందే

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి 10 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య‌ వ‌య‌సున్న మ‌హిళ‌ల ప్ర‌వేశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ అంశంపై ట్రావెన్‌కోర్ దేవ‌స్థానం బోర్డు యూట‌ర్న్ తీసుకున్న‌ది. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు ఆల‌యంలోకి వెళ్ల‌వ‌చ్చు అని బోర్డు సుప్రీం ముందు తెలిపింది. బోర్డు ఏదైనా నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌దా అని జ‌స్టిస్ ఇందూ మ‌ల్హోత్రా అడిగారు. దానికి బోర్డు కౌన్సిల్ రాకేశ్ ద్వివేదీ స‌మాధానం ఇచ్చారు. మ‌హిళ‌ల ప్ర‌వేశంపై సుప్రీం తీర్పును గౌర‌విస్తామ‌ని, ఈ విష‌య‌మైన పిటిష‌న్ వేశామ‌ని, మ‌హిళ‌ల ప్ర‌వేశంపై త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకున్నామ‌ని బోర్డు వెల్ల‌డించింది. కానీ శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌ధాన పూజారి మాత్రం బోర్డు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. ఇటీవ‌ల ఇద్ద‌రు మ‌హిళ‌లు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్న త‌ర్వాత‌... ఆల‌యాన్ని మూసివేసి శుద్ధి చేసిన విష‌యం తెలిసిందే. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌చ్చు అని గ‌త ఏడాది సుప్రీం తీర్పు ఇచ్చిన త‌ర్వాత‌.. కేర‌ళ‌లో ఆందోళ‌న‌లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. సుప్రీం తీర్పుకు వ్య‌తిరేకం మొత్తం 65 పిటిష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఇటీవ‌ల క‌న‌క‌దుర్గ‌, బిందు అనే ఇద్ద‌రు మ‌హిళ‌లు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నారు. జీవ‌వైవిధ్య కార‌ణాల వ‌ల్ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని అడ్డుకోలేమ‌ని ఇవాళ ట్రావెన్‌కోర్టు బోర్డు కోర్టు ముందు వెల్ల‌డించింది. స‌మాన‌త్వం అనేది రాజ్యాంగ నియ‌మం అని పేర్కొన్నారు. అయితే ఇవాళ్టి పిటిష‌న్ల‌పై తీర్పును రిజ‌ర్వ్‌లో ఉంచుతున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

Related Posts