స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 71 పాయింట్ల కిందకి పడిపోయి 33,703 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 10,360 వద్ద ముగిశాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే, రూపాయి విలువ మంగళవారం 64.85 తో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం ప్రపంచ ముడి ధరలు, వాణిజ్య లోటు తీవ్రతరం కావడంతో అమెరికా డాలర్ విలువ కంటే రూపాయి విలువ 64.21 దిగువకు పడిపోయి 30 పైసల వద్ద ముగిసింది.కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో షేర్ల కొనుగోళ్లు కాస్త జోరుగా కొనసాగడంతో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఆరు సెషన్లలో కోల్పోయినా.. 0.3 శాతంగా అధికంగా లాభాల్లో ముగిసింది.