YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం

 పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల దగ్గర పడుతుండటంతో దూకుడు పెంచారు వైసీపీ అధినేత జగన్. ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు మొదలు పెట్టారు. అన్న పిలుపుతో పాటూ సమర శంఖారావం పేరుతో సరికొత్త కార్యక్రమాలను చేపట్టారు. బుధవారం తిరుపతి తనుపల్లెక్రాస్‌ పీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌‌లో ‘‘అన్న పిలుపు’’ కార్యక్రమంలో భాగంగా తటస్థులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తన జీవితకాలం ప్రజలతో ప్రయాణించాలన్న ఉద్దేశంతో మెరుగైన పాలనకు సలహాలు సూచనలు కోరుతున్నానన్నారు జగన్. తటస్థుల నుంచి వచ్చిన ప్రశ్నలకు జగన్ సమాధానం ఇచ్చారు. తన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను వారితో పంచుకున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు నవరత్నాలు తీసుకొచ్చామని.. ఆ పథకాలతో ప్రజలకు ఎలాంటి లబ్ది చేకూరుతుందో వివరించారు. ఉద్యోగాలు రావాలంటే విప్లవాత్మక మార్పులు రావాలన్నారు జగన్. పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ.. ఆ పరిశ్రమల్లో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. దేవుడి ఆశీస్సులతో వైసీపీ ప్రభుత్వం రాగానే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకు వస్తామన్నారు. పాదయాత్రలో చేనేతల సమస్యలను తెలుసుకున్నానని.. మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ నెలకు రూ.2వేలు ఇస్తామన్నారు . నవరత్నాల్లో చెప్పినవి కాక ఈ సహాయం అందుతుంది. చేనేతలు ఆకలి బాధలకు గురికాకూడదన్నారు. తిరుపతి సమర శంఖారావం కు హాజరైన వారిని చూస్తుంటే.. కౌరవ సామ్రాజ్యాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యంలా ఉందని వైసీపీ అధినేత జగన్ అభివర్ణించారు. తిరుపతిలో నిర్వహిస్తున్నవైసీపీ ‘సమర శంఖారావం’ లో ఆయన మాట్లాడుతూ, త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, బూత్ కమిటీలకు దిశా నిర్దేశం చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. తొమ్మిదేళ్లుగా ఎన్నో కష్టాలకు ఓర్చి తన వెంట నడిచారని, చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారని అన్నారు. 

Related Posts