YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సోషల్ మీడియాలో వైసీపీ విశాఖ జాబితా

సోషల్ మీడియాలో వైసీపీ విశాఖ జాబితా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వైసీపీ మొదటి జాబితా అంటూ ఒకటి విశాఖ రాజకీయాల్లో హల్ చల్ చేస్తోంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న వారిలో నలుగురి పేర్లు ఖరార్ అయినట్లుగా చెబుతున్నారు. విశాఖ దక్షిణం నుంచి డాక్టర్ రమణమూర్తి, ఉత్తరం నుంచి కేకే రాజు, పశ్చిమం నుంచి మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్, తూర్పు నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ లకు టికెట్లు ఇస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో ఆశావహులంతా డీలా పడుతున్నారు. ఇది నిజమా కదా అని వాకబు చేసుకోవడమే కాదు, అవసరమైతే తాము పోటీగా రంగంలోకి దిగాలనుకుంటున్నారు.విశాఖ అర్బన్ జిల్లాలో ఆ నలుగురికి టికెట్లు అంటూ జరుగుతున్న ప్రచారమే నిజమైతే పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇందులో ఉత్తరం నుంచి కేకే రాజుకి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని ఏకంగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితమే పార్టీలో చేరిన ఆయన్ని ఎమ్మెల్యే అభర్ధిగా ఎలా నిలబెడతారని కూడా ప్రశ్నిస్తున్నారు. పలు సర్వేల్లో సైతం రాజుకు మైనస్ మార్కులు వచ్చాయని, పైగా ఆయన నియోజకవర్గంలో ఎవరికీ తెలియదని కూడా అంటున్నారు. సామాజిక సమీకరణలు చూసుకున్న ఆయన అభ్యర్ధిత్వం తప్పు అని కూడా గట్టిగా చెబుతున్నారు. అదే విధంగా విశాఖ దక్షిణంలో డాక్టర్ గారి మీద కూడా అటు పార్టీలో, ఇటు జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆయన స్థానికేతరుడు కావడమే కాకుండా జన బాహుళ్యానికి పెద్దగా పరిచయం లేని వారని కూడా చెబుతున్నారు. మిగిలిన రెండు చోట్లా ఇద్దరికీ టికెట్ రావడం అందరూ ఊహించిందేనని, వారే అక్కడ గట్టి అభ్యర్ధులేనని అంటున్నారు. వైసీపీకి చెందిన జిల్లా ఇంచార్జుల్లో బీపీ పెరిగిపోతోంది. అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారన ప్రచారంతో పాటు, కొన్ని చోట్ల ఇంచార్జిలకు చెక్ పెడుతున్నారని వస్తున్న వార్తలతో వారు కంగారు పడుతున్నారు. పెందుర్తిలో గత నాలుగేళ్ళుగా ప్రజల్లో ఉంటూ పనిచేసుకుంటున్న ఇంచార్జి అదీప్ రాజ్ కి టికెట్ ఇవ్వరన్న ప్రచారంతో క్యాడర్ మండిపడుతోంది. ఆయన స్థానంలో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఉత్తరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చొక్కాకుల వెంకటరావు, గుడివాడ అమర్నాధ్ లలో ఒకరికి టికెట్ ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే అసలుకే ఎసరు పెట్టినట్లవుతుందని అంటున్నారు. ఇక భీమిలీలోనూ ప్రస్తుత ఇంచార్జి విజయనిర్మలకు టికెట్ రాదని, కొత్త వారు దిగుమతి అవుతారని ప్రచారం సాగుతోంది. గాజువాకలో కూడా ఇంచార్జి తిప్పల నాగిరెడ్డికి బదులుగా వేరే వారిని దించాలని ఆలోచిస్తున్నారని వస్తున్న వార్తలు మొత్తం వైసీపీ ఇంచార్జుల్లో కలవరం రేపుతోంది. అదే కనుక జరిగితే విశాఖలో చాలా చోట్ల పార్టీకి ఓటమి తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు

Related Posts