మన దగ్గిర ఇలా సిగ్గు పడే వాళ్ళు వున్నారా ?
ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది… అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది… ఆ ఊరు చేరుకున్నది…
ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేద