యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంటే... బీటెక్ సీట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. గత నాలుగేళ్లలో అవి సగం తగ్గిపోయాయి. వచ్చే ఏడాది వేల సీట్లకు ఎసరు తప్పేలా లేదు. 8 ఇంజినీరింగ్ కాలేజీలు క్లోజ్ కాబోతున్నాయి. వాటిని నడపలేమంటూ వాటి మేనేజ్‌మెంట్లు JNTUHకు అప్లికేషన్లు పెట్టుకున్నాయి. అక్కడితో అయిపోలేదు. మరో 26 బీటెక్ బ్రాంచీలను కూడా మూసేస్తామనీ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్లు JNTUకి అప్లికేషన్లు పెట్టుకున్నాయి. ఇలా అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఫిబ్రవరి 5 వరకు టైం ఉంది. ఆ టైం దాటిపోవడంతో... ఎన్ని కాలేజీలు ఎలాంటి అప్లికేషన్లు పెట్టుకున్నాయన్నదానిపై లెక్కలు తీశారు. అప్పుడు తెలిశాయి ఈ విషయాలు. మొత్తం 3,500 బీటెక్ సీట్లను తగ్గించుకోవడానికి కాలేజీల యాజమాన్యాలే సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల JNTU ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ. అందువల్ల బీటెక్ చదవాలనుకునే స్టూడెంట్స్‌కి సీట్ల కొరత తప్పదన్న సంకేతాలొస్తున్నాయి.ఎన్ని సీట్లకు కోత పడుతుందన్నది మే నెలలో తేలుతుంది. అప్పుడు యూనివర్సిటీ తనిఖీలు చేస్తారు. కాలేజీల్లో నిబంధనల ప్రకారం ప్రమాణాలు, సౌకర్యాలు ఉన్నాయో లేవో చూస్తారు. అప్పుడు తేలుతుంది సీట్ల కోత వ్యవహారం. ప్రస్తుతం JNTUH పరిధిలో 173 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి 96,518 బీటెక్ సీట్లు ఉండేవి. ఐతే... కొన్ని కాలేజీలు తమంతట తామే సీట్లకు కోత పెట్టుకున్నాయి. అందువల్ల సీట్ల సంఖ్య 93 వేలకు తగ్గబోతోంది. బీటెక్ సీట్లు తగ్గిస్తున్నప్పుడు ఎంటెక్ మాత్రం ఎందుకు అనుకుంటూ 66 ఎంటెక్ బ్రాంచీలను క్లోజ్ చేస్తున్నారు. ఫలితంగా 1400 ఎంటెక్ సీట్లు తగ్గిపోబోతున్నాయి.కాలేజీలు ఏమంటున్నాయంటే... ఇంజినీరింగ్ ఎక్కువమంది చదవట్లేదనీ, ఏటా సీట్లు మిగిలిపోతున్నాయనీ అంటున్నాయి. అందుకే సీట్లను రద్దు చేసుకుంటున్నట్లు చెబుతున్నాయి. విద్యార్థులేమో తమకు తగిన కాలేజీలో సీట్ దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఈ పరిస్థితి తలెత్తేలా కనిపిస్తోంది.