YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాపులను మోసం చేస్తున్న చంద్రబాబు

కాపులను మోసం చేస్తున్న చంద్రబాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

చంద్రబాబు చేసే మోసాన్ని కూడా ఆకాశాన్ని ఎత్తే మీడియాను చూస్తుంటే భయం వేస్తోంది. చంద్రబాబు మరోసారి కాపులను మోసం చేయడానికి తెరలేపారు. 2014లో తన అధికారం కోసం కాపుల్ని బిసిలలో చేరుస్తానని వాగ్దానం చేశారు. ముద్రగడ పద్మనాభం రోడ్డేక్కేవరకు కూడా కాపులను మరిచిపోయారని వైకాపా అధికార ప్రతినిధి పెర్ని నాని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు కాపు రిజర్వేషన్లు గుర్తుకువచ్చాయి. మంజునాధ కమీషన్ ను వేసి ముగిద్దామని చూశారు. జస్టిస్ మంజనాధ రిపోర్ట్ ఇవ్వకుండానే వారి సభ్యులతో రిపోర్ట్ తీసుకుని కాపులను బిసిలలో చేరుస్తన్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేశారు. 13 జిల్లాల్లోని కాపు సోదరులు అందరి నోట్లలో స్వీట్లు తినిపించి మీరు బిసిలయ్యారంటూ  సంబరాలు చేసి మోసం చేశారు. అప్పటినుంచి ఈరోజు వరకు కాపులు బిసి సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్దితి ఉందా? ఎంఆర్ ఓ కార్యాలయాల్లో బిసి ఎఫ్ సర్టిఫికేట్  అడిగితే ఎంఆర్ ఓలు కాపులను ఎగతాళి చేసే పరిస్దితి వుందని అన్నారు. అసలు కాపులను ఎన్నిసార్లు బిసిలను చేస్తారు.గతంలో అసెంబ్లీలో చేసింది ఏంటి. నేడు అసెంబ్లీలో చేసింది ఏంటి?చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు ఇవికావాఅని ప్రశ్నించారు. గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నారంట ఓ పెద్దాయన. అదే రీతిలో ప్రధాని నరేంద్రమోది ఆర్దికంగా వెనకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో  ఐదుశాతం ఇస్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించారు.ఇది మోసపూరితమని విమర్శించారు. ఈబిసిలలో కాపులకు సగం అంటూ మరోమోసానికి పాల్పడ్డారు. బిసి వర్గాలందరితో కాపులకు తగాదా పెట్టారు.ఈరోజు అర్దికంగా వెనకబడిన అగ్రవర్ణపేదలతో కూడ  తగాదాలు పెట్టేపరిస్దితి చంద్రబాబు తెచ్చారు. కాపులను ఏకాకి చేసే కుట్ర చేస్తున్నారు. కాపులను మొన్న బిసిలను చేశామని చెప్పారు.నేడు ఈబిసిలను చేశామని అంటున్నారు. కాపులు బిసిలా ?ఈబిసిలా మీరు ఏ కేటగిరిలో చేర్చారు చంద్రబాబు సమాధానం చెప్పండని అన్నారు. దళిత క్రైస్తవులందరిని ఎస్సీలను చేసేశామని నిన్న అసెంబ్లీలో ప్రకటన చేశారు. కాపులకు లాగా వారికి కూడా స్వీట్లు తినిపిస్తారేమో.  గతంలో ఎస్సీ వర్గీకరణపేరుతో ఎస్సీలలో చిచ్చురేపి ఆ వేడిలో చలికాసుకున్న వ్యక్తి చంద్రబాబు. దళిత క్ర్లైస్తవుల గురించి కేంద్రంతో కనీసం ఒక్కమాటైనా మాట్లాడారా అని అడిగారు. తునిలో రైలు తగులబెట్టారని,రాజధానిలో తోటలు తగులపెట్టారు.పోలవరం ను అడ్డుకుంటున్నారు. ప్రత్యేక హోదా అంటే జైలులో వేస్తామని మీరంటే అయినప్పటికి హోదా కోసం పోరాటం చేసింది ఎవరు   వైయస్ జగన్ కాదా అని గుర్తు చేసారు. క్యాండిల్ ర్యాలీలే వద్దని చెప్పిన నీ చేత ఇటీవల విజయవాడలో కాగడాలు పట్టించింది  జగన్ మాత్రమే. అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజి చాలు అన్ని మీ చేత అదే అసెంబ్లీలోనే ప్రత్యేకహోదా కావాలని నల్లబ్యాడ్జిలు  ధరించేలా చేసింది జగన్ మాత్రమే.  ఓట్ల పండుగ వస్తుందంటే చంద్రబాబు వందలమోసాలకు తయారవుతాడు. తక్కువధరకే గృహోపకరణాలు ఇస్తారని చెప్పి మన ప్రజలను మోసం చేసిన తమిళనాడుకు చెందిన మోసగాడి నైజమే చంద్రబాబుది. ఓట్లు వస్తాయని ఏదైనా ఇంటిలిజెన్స్ చెబితే చాలు వాటికి శంఖుస్దాపన చేస్తారు.బడ్జెట్ లో ఏమాత్రం నిధులు కేటాయించకపోయినా వాటని ప్రారంబిస్తానికి బయల్దేరతాడు.కడప ఉక్కుఫ్యాక్టరీ,బందర్ పోర్టుల విషయంలో చేస్తుంది అదేనని అన్నారు,

Related Posts