YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీని గెలిపించే బాధ్యత భుజాలపై వేసుకోండి: జగన్

వైసీపీని గెలిపించే బాధ్యత భుజాలపై వేసుకోండి: జగన్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఈ గడ్డ తనకు, తన కుటుంబానికి చాలా ఇచ్చిందని కడపలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందని, తాము అధికారంలోకొస్తే అందర్నీ అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని, వైసీపీని గెలిపించే బాధ్యత తమ భుజాలపై వేసుకోవాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపు నిచ్చారు.చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, దొంగ సర్వేలు చేయిస్తూ, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, ఎన్నికల సమయంలో డబ్బులు పంచాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని, వీటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. మన యుద్ధం  కేవలం చంద్రబాబు ఒక్కరితోనే కాదని, ఎల్లో మీడియాతో కూడా అని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎస్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ గురువారం కడపలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీల పేరుతో జాప్యం చేయమని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్ చేస్తామని, వ్యవస్థల్లో అవినీతి లేకుండా, పరిపాలనలో పారదర్శక విధానానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు.. 2008లో వెయ్యి పోస్టులతో మాత్రమే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు వేశారని తెలిపారు. పదేళ్లుగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఊసే లేదన్నారు. ‘రాష్ట్రంలో 5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కేవలం మొన్న మాత్రమే 240 పోస్టులు చంద్రబాబు వేశారు. ఇది చాలా అన్యాయం. యూనివర్శిటీలో విద్యార్థులకు ఫెలోషిప్‌లు రావడంలేదు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేనందువల్లే రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య వేళ్లూనుకుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అదే విధంగా ఫీజు బకాయిలు రద్దు చేసి, పీహెచ్‌డీ స్కాలర్స్‌కు రూ.5 వేలు, పీజీ విద్యార్థులకు రూ.3వేలు ఇవ్వాలని కోరుతున్నాన్నారు.

Related Posts