యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నరేంద్ర మోదీ వణికిపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యూపీయే మళ్ళీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లును ఉపసంహరిస్తామని చెప్పారు.మోదీని పరోక్షంగా ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ 56 అంగుళాల ఛాతీ వణికిపోతోందన్నారు. ఈ దేశం అందరిదీనని చెప్పారు. రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మోదీ ఇటీవల చాలా భయపడుతున్నారన్నారు. ఆయన చాలా నిరాశతో కనిపిస్తున్నారన్నారు. విద్వేషాన్ని వ్యాపింపజేయడం వల్ల మనుగడ ఉండదని ఆయన తెలుసుకున్నారన్నారు.రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రాహుల్ శపథం చేశారు. బీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.ప్రధాని నరేంద్ర మోదీపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పిరికిపంద అని, దమ్ముంటే అతను ఓ 10 నిమిషాల పాటు తనతో చర్చించాలని రాహుల్ సవాల్ విసిరారు. ఏఐసీసీ మైనార్టీ సెల్ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనది 56 ఇంచుల ఛాతి అని మోదీ అన్నారని, తనతో ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ చేస్తున్నానని రాహుల్ అన్నారు. స్టేజ్ మీద ఆయన నాతో పది నిమిషాలు కూడా మాట్లాడలేడని, అతనో పరికిపంద అని రాహుల్ విమర్శించారు. ఏ ఎజెండా లేకుండానే మోదీ చైనాకు వెళ్లారని, డోక్లామ్ అంశంలో బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. మోదీ ఛాతి 4 ఇంచులే అని చైనా వాళ్లు నిరూపించారని రాహుల్ విమర్శించారు.కనీస ఆదాయం కల్పిస్తామని తమ పార్టీ హామీ ఇచ్చిందని, అంటే ప్రతి పేదకు నేరుగా లబ్ది చేకూరుతుందని అన్నారు.