యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ, చంద్రబాబు టార్గెట్గా మరోసారి రెచ్చిపోయారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇటీవల సంచలనం రేపిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు విషయంలో టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏపీ పోలీసుల ప్రతిష్టను ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారంటూనే.. ఈ హత్యకేసుపై సంచలన ఆరోపణలు చేశారు. హంతకులకు ఏపీ స్వర్గధామైంది. నేరం చేసినా తప్పించుకోవచ్చనే ధైర్యం క్రిమినల్స్ కొచ్చింది. చిగురుపాటి అనే NRIని హైదరాబాద్లో చంపి ఏపికి తీసుకొచ్చి పడేయడానికి కారణం ఇదే. ఏపీలో పోలీసులను మేనేజ్ చేయొచ్చు. ఎలాగూ టీడీపీ సర్కారు అండదండలుంటాయని హంతకులు నిర్భయంగా శవాన్ని వదిలి వెళ్లారు’ అంటూ ధ్వజమెత్తారు. హంతకులకు ఏపీ స్వర్గధామైంది. నేరం చేసినా తప్పించుకోవచ్చనే ధైర్యం క్రిమినల్స్ కొచ్చింది. చిగురుపాటి అనే NRIని హైదరాబాద్ లో చంపి ఏపికి తీసుకొచ్చి పడేయడానికి కారణం ఇదే. ఏపీ లో పోలీసులను మేనేజ్ చేయొచ్చు. ఎలాగూ టీడీపీ సర్కారు అండదండలుంటాయని హంతకులు నిర్భయంగా శవాన్ని వదిలి వెళ్లారు.మరో ట్వీట్లో ‘ఏపీ పోలీసు ప్రతిష్ఠను సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబు గారిది. జగన్ గారి హత్యాయత్నం కేసును నిర్వీర్యం చేసే యత్నం చేశాడు. ఎన్నారై చిగురుపాటి హత్య కేసుకు అదే గతి పట్టించాడు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని మృతుని భార్య హైదరాబాద్ లో ఫిర్యాదు చేసింది. సిగ్గనిపించడం లేదా బాబూ?’అంటూ ప్రశ్నించారు.