బందరు పోర్టు పనులను సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మచిలీపట్నం ప్రజల చిరకాల కోరిక నిజమైందన్నారు. శాతవాహనుల కాలంలో ఇక్కడ నుంచి ఎగుమతి, దిగుమతులు అయ్యేవని వివరించారు. నిర్లక్ష్యానికి గురికావడంతో ప్రజలు వలస వెళ్లారని చెప్పారు. బందరు పోర్టు నిర్మాణంతో మచిలీపట్నానికి పూర్వవైభవం తెస్తామని ప్రకటించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసే సత్తా నవయుగ కంపెనీకి ఉందన్నారు. పోర్టును సకాలంలో పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి కూడా తానే వస్తానని స్పష్టంచేశారు. బందరు పోర్టు వినియోగంలోకి వస్తే.. దేశంలోనే మచిలీపట్నం ప్రధాన ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కోరారు