YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంటింటికి చంద్రబాబు లేఖలు...

ఇంటింటికి చంద్రబాబు లేఖలు...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని కలలుగంటున్న ప్రతిపక్ష నేతలు జనాన్ని తప్పుదోవ పట్టించే మాటలు చెప్తున్నాయి. వీటిని గమనించిన బాబు వారికి దిమ్మతిరిగే విధంగా వ్యూహం రచించారు. రాష్ట్రంలో ఈ 57 నెలల కాలంలో ఎవరు ఏ పథకం ద్వారా ఎవరు ఎంత లబ్ది పొందారో ఆ వివరాలన్నీ బయటకు తీసి నేరుగా వారి ఇంటికే పంపించేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతీ కుటుంబానికి చంద్రబాబు ఓ లేఖ రాయబోతున్నారు. ఒక్కో ఇంట్లో ఎవరు ఏయే పథకాల ద్వారా ఎంత లబ్ధిపొందారనే సమాచారం క్రోడీకరించి ఆ కుటుంబానికి నేరుగా అందజేసే విధంగా పనులు జరుగుతున్నాయట. వీటన్నింటినీ ఆర్‌ టీ జీఎస్ సహాయంతో మండల పరిషత్‌ కార్యాలయాల ద్వారా జాబితాలను సిద్ధంచేసి పంచాయతీల ద్వారా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందించబోతున్నారట. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ 57 నెలల్లో అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి పేరిట కరపత్రాలను ఈ కార్యక్రమం ద్వారా వారి ముందుంచనున్నారట.డ్వాక్రా సంఘాలకు రుణాలు, రైతు రుణమాఫీ, పసుపు-కుంకుమ, అన్ని కేటగిరిల కింద పంపిణీచేసిన పెన్షన్లు, గృహనిర్మాణం, ఆదరణ-2 లబ్ధిదారుల వివరాలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిపొందినవారి వివరాలు, అభయహస్తం, యువనేస్తం, చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లికానుక, ఎస్సీఎస్టీ లబ్ధిదారులకు ఉచిత కరెంట్‌, విదేశీ విద్య, సీఎం సహాయనిధి, ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌తోపాటు ఇంకా అనేక పథకాల ద్వారా లబ్ధిపొందిన అందరి జాబితాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ జాబితాల ద్వారా బినామీల పేరిట లబ్ధిపొందేవారి అసలు బండారం కూడా బహిర్గతం కానుండటం మరో విశేషం. కాగా ఈ నాలుగేళ్లో ఒక్కో కుటుంబానికి కనీసంగా ఐదు లక్షలకుపైగానే లబ్ది చేకూరినట్లు టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాబుకు వచ్చిన ఈ వినూత్న ఆలోచన జనంలో చంద్రబాబు ఏం చేశారనే క్లారిటీ ఇస్తుందని, తద్వారా జనం మేల్కొని బాబు ప్రత్యర్థులను తరిమికొడట్టడం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

Related Posts