యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ బాగానే ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఆయనను భారీ మొత్తానికి ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. పీకే నేతృత్వంలో ఆయన టీం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంపైన ప్రత్యేక రిపోర్టులు తయారుచేసిందట. నియోజకవర్గ వారీ రిపోర్టుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం టిక్కెట్టు ఆశిస్తున్న వాళ్లు ఉన్నారు. మరి ఈ నేతలపై పీకే రిపోర్టు తయారుచేయడం వరకు ఓకే గానీ ఇలా వన్ టు వన్ మీటింగులు పెట్టడంలో ఉద్దేశం ఏంటి అనేది ఇపుడు పెద్ద పాయింట్.ఒక పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశిస్తున్న అభ్యర్థిని అయితే పార్టీ అధ్యక్షుడు పిలిపించాలి గాని ఇలా ఒక స్ట్రాటజిస్టు పిలిపించడం ఏంటి అని ఆయా అభ్యర్థుల అనుచరులు కొంత అసంతృప్తితో ఉన్నారు. అయితే… దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఒకటి ఏ ఎన్నికలు వచ్చినా కాంపిటీషనులో ఉన్న పార్టీలకు నియోజకవర్గానికి ఇద్దరు నుంచి నలుగురు దాకా టిక్కెట్ ఆశించే అవకాశం ఉంది. మరి వీళ్లందరిలో ఎంపిక చేయాల్సింది ఒకరినే. అరకొర వ్యక్తులు తప్ప… ఎంతో కొంత బలం లేని వ్యక్తులు ఏమీ రేస్‌లో ఉండరు. అందుకే జగన్ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాను ఫస్ట్ స్క్రాప్‌ని ఏరేయాలనుకుంటున్నాడు. ఆ బురద తానెందుకు అంటించుకోవడం… ముందుగా అందరినీ పీకేతో కలిపిస్తే… ఆల్మోస్ట్ ఇక టిక్కెట్ రాదు అనుకున్న వారిని రిపోర్టులతో భయపెట్టేసి మానసికంగా బలహీన పరచడానికి పీకేని వాడుకుంటున్నారు. 360 కోణాల్లో వీలైనంత నెగెటివ్ రిపోర్టులు వారి ముందు పెట్టి… ఇదీ మీ పరిస్థితి. మీకు టిక్కెట్ ఇస్తే మీరూ గెలవరు, పార్టీనూ గెలవదు. మరేం చేయమంటారు చెప్పండి అంటూ ఏకరువు పెడుతున్నారట పీకే. ఆయన మాటలతోనే వారికి సగం ఆశలు పోతాయి. ఆ తర్వాత జగన్ నెగెటివ్ చెప్పినా ఆగ్రహం, కోపం జగన్ మీదకు పోకుండా పార్టీలో అసంతృప్తిని తగ్గించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని జగన్ ఈ వ్యూహం రచించాడని చెబుతున్నారు. ఇక పీకే మీటింగుల తీరు చూస్తే… ఆయన ఇప్పటికే పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స అల్లుడు తదితరులు పీకే పిలిచిన జాబితాలో ఉన్నారు. ఈ మీటింగుల ప్రక్రియ ఒక వారంపాటు కొనసాగొచ్చు. ముందుగా నెగెటివ్ రిపోర్టులు ఉన్న వారినే పిలుస్తున్నారని తెలుస్తోంది.