YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ జనసేనలో జోష్

విశాఖ జనసేనలో జోష్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జనసేన పార్టీ మరింత జోష్‌ను పెంచింది. వారం రోజుల వ్యవధిలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా మహిళలకు ఉన్నతమైన బాధ్యతలు అప్పగిస్తూ కమిటీలను ఏర్పాటు చేసిన పవన్‌ ఇప్పుడు పురుషులకు పెద్దపీట వేశారు. ఒకే రోజు రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు చెందిన పార్లమెంటరీ కమిటీలను నియమిస్తూ ప్రకటన చేశారు. దీంతో జనసేనలో నూతనుత్తేజం నెలకొంది. విశాఖ పార్లమెంటరీ కమిటీకి రీజనల్‌ సెక్రటరీగా గాజువాకకు చెందిన కోన తాతారావును నియమించారు. సెక్రటరీగా బొలిశెట్టి సత్యనారాయణను, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా ఎం. రాఘవరావు, బొగ్గు శ్రీనివాసరావు, తిప్పల రమణారెడ్డి, గడసాల అప్పారావు, ఆలివర్‌ రారు, వైస్‌ చైర్మన్‌గా పివి.శివప్రసాద్‌రెడ్డి, కోశాధికారిగా తోట సత్యనారాయణ, అధికార ప్రతినిధులుగా యు.ప్రవీణ్‌బాబు, చోడిపల్లి ముసలయ్యలను నియమించారు. సిటిజన్‌ కౌన్సిల్‌కు నండూరి రామకృష్ణ, లీగల్‌ విభాగానికి వై.మార్కండేయులను ఎంపిక చేశారు. వీరితో పాటు 11 మంది ఎగ్జిక్యూటివ్‌కమిటీ, 32 మందితో వర్కింగ్‌ కమిటీలను కూడా నియమించారు. విశాఖ పార్టమెంటరీ కమిటీతో పాటు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, వర్కింగ్‌ కమిటీలను నియమిస్తూ మొత్తం 56 మందికి ఈ కమిటీల్లో అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలు, అభిమానుల్లో నూతనుత్తేజం కనిపిస్తుంది. వీటితో పాటు గ్రామ కమిటీలకు కూడా ఆ పార్టీ జాబితాలను తయారు చేయనుండటంతో ఆ పార్టీ కేడర్‌లో ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటికే నగరానికి చెందిన ఉషశ్రీని క్యాంపెయిన్‌, పబ్లిసిటీ విభాగానికి చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆమెతో పాటు మరో 25 మంది మహిళలకు వివిధ విభాగాల బాధ్యతలను అప్పగిస్తూ పవన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వీరంతా ప్రచారాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు పురుషులకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేయడంతో పార్టీలో మరింత ఉత్సాహం రెట్టింపయింది. కమిటీల నియామకంలో ఎటువంటి అవకతవకలూ లేకపోవడం, కష్టపడినవారికే అవకాశం ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 

Related Posts