Highlights
- ‘హోదా’ సెంటిమెంట్‌తో లబ్ధికి వైసీపీ యత్నం
- సోనియా, రాహుల్‌నూ నమ్మలేం
- విపక్షాలైపె సీఎం చంద్రబాబు ఫైర్
పార్లమెంట్‌లో తెలుగుదేశం ఎంపీలు గొడవ చేస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలు కనీసం నోరు మెదపకుండా ఉండిపోపయారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. వీళ్లను నమ్ముకుని పార్లమెంట్‌లో అవిశాస్వ తీర్మానం ఎలా పెట్టాలని అన్నారు. టీడీపీ సవున్వయ కమిటీ సమావేశంలో విపక్షాల ఎత్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో కేవీపీ ప్లకార్డులు పట్టుకుంటే తమకు సంబంధం లేదని, సస్పెండ్ చేసుకోవచ్చని ఆ పార్టీ నేత ఆజాద్ అనడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనవుని చంద్రబాబు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. టీడీపీ కూడా అవిశ్వాసాన్ని చివరి అస్త్రంగా వాడేందుకు సిద్ధమనడంతో వైసీపీ మళ్లీ వెనక్కి తగ్గుతోంద చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ రోజుకో మాట మాట్లాడుతోందని, ఉప ఎన్నికలు రావన్న నమ్మకంతోనే ఎంపీల రాజీనామాలకు తెరతీసిందని ఆరోపించారు. దీనిపై ఇతర పార్టీలు విమర్శలు చేయడంతో మళ్లీ ఇప్పుడు అవిశ్వాసం అంటోందన్నారు. ఈ సెంటిమెంట్‌తో వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు.