YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తూర్పుగోదావరిలో మద్యం...ఎట్ ఎనీ టైమ్

తూర్పుగోదావరిలో మద్యం...ఎట్ ఎనీ టైమ్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
'మూడు ఫుల్లులు... ఆరు బీరులు' అన్న చందాన జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని ప్రదేశాల్లో సైతం అన్ని వేళల్లోనూ మద్యం బాటిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎనీటైమ్‌ మందు విచ్చలవిడిగా దొరుకుతుంది. లిక్కర్‌ బిజినెన్‌లో ఆరితేరిన వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలకు నీళ్లొదులుతున్నా అబ్కారీ శాఖ అధికారులు పట్టన్నట్లు వ్యవహరిస్తుండటం వలన అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మద్యం బెల్టు షాపుల్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అబ్కారీ శాఖ అధికారులు పట్టనట్లే వదిలేస్తున్నారు. లైసెన్సులు కలిగిన షాపులకు అనుబంధంగా 2 వేలకు పైగా బెల్ట్‌ షాపులు జోరుగా నడుపుతున్నారు. కాకినాడ, అమలాపురం డివిజన్లలో అధికంగా ఇవి ఉన్నట్లు అధికారులే చెబుతుండటం గమనార్హం. రాజకీయ నాయకుల అండదండలతో పలు చోట్ల ఇవి కొనసాగుతున్నాయి.జిల్లాలో 524 మద్యం దుకాణాలు,38 బార్ల ద్వారా లిక్కర్‌ వ్యాపారం జరుగుతుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం పట్టణాలు, ఇతర ముఖ్య మండలాల్లో మద్యం వ్యాపారాలు జోరందుకున్నాయి. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో మరింత బిజినెస్‌ జరుగనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే అమ్మకాలు జరపాల్సి ఉంది. అయితే పలుచోట్ల రాత్రి 12 గంటలైనా లైసెన్స్‌ షాపులు తెరిచివుంటున్నాయి. దీనికితోడు జిల్లావ్యాప్తంగా అన్ని షాపులు యథేచ్ఛగా 24 గంటలూ అమ్మకాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నాయి. పర్మిట్‌ రూముల పేరుతో విచ్చలవిడిగా వ్యాపారాలు జరుపుతున్నారు. లైసెన్స్‌ షాపులకు వెనుక భాగంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని సమయాల్లోనూ అమ్ముతున్నారు.మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సిండికేటు గాళ్లకు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో విచ్చలవిడిగా మందు వ్యాపారానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. జిల్లాలో ఈ ఏడాది జవవరి 1 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకూ నిత్యం జరిగిన బిజినెస్‌లో 4 లక్షల 14 వేల 782 ఐఎంఎల్‌ కేసులు, 3 లక్షల 24 వేల 428 బీరు కేసులు అమ్ముడవ్వగా, రూ.230.52 కోట్ల వ్యాపారం జరిగింది. రూ.కోట్లలో జరుగుతున్న వ్యాపారంలో రూ.లక్షల్లో సొమ్ములు చేతులు మారుతుండటంతో అధికారులు పట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒత్తిళ్ల నడుమ వాటిని తొలగించేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొందరు ఎక్సైజ్‌ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.వేళాపాలా లేకుండా 24 గంటలూ విక్రయాలు జరుపుతున్న సిండికేట్‌దారులు ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పి ధరలను మించి అమ్మకాలు జరుపుతున్నారు. క్వార్టర్‌పై కొన్నిచోట్ల రూ.5- 10 అదనంగా, మరికొన్ని చోట్ల రూ.10- 15 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వ్యాపారాలు సాగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

Related Posts