యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సకాలంలో దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా హెచ్‌ఎండిఎ ఆదాయం ఏటా రెట్టింపవుతోంది. ఓ వైపు దరఖాస్తుల పరిష్కారంలో ఆన్‌లైన్ విధానాన్ని అమలు పరుస్తూనే మరోవైపు అక్రమలేఅవుట్లు, నిర్మాణాలపై కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఫలితంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఆదాయం చేకూరుతుంది. ముఖ్యంగా ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు అదనపు బాధ్యతలున్నప్పటికీ, డిప్యూటేషన్‌పై వచ్చినప్పటికీ దరఖాస్తుల పరిష్కారాన్ని సమయానుకూలంగా చేయడం వల్ల 2016లో కేవలం 411 దరఖాస్తుల రాగా రూ. 29.51 కోట్లు ఆదాయం వచ్చింది. అదే 2018 వచ్చే సరికి 2363 దరఖాస్తులు వచ్చి రూ.404.67 కోట్లుగా ఆదాయం చేరింది. అంటే ప్రణాళికా విభాగం పనితీరు ఏమేర కు సత్ఫలితాలను సాధిస్తుందో విదితమవుతోంది. త త్ఫలితంగా భారీ పథకాలు కార్యరూపంలోకి రావడానికి దోహదం జరుగుతుంది. గతంలో ఏటా వందకోట్లు కూడా దాటని ప్లానింగ్ విభాగపు ఆదాయం గత 2015 నుంచి దరఖాస్తులు రావడం అధికమై ంది. 2016లో డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం వచ్చిన తర్వాత కేవలం 2030 రోజుల్లోనే లేఅవుట్లకు, బహుళ అంతస్థుల భవనాలకు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు అనుమతులు మంజూరు కావడంతో రియల్టర్లు కూడా అనుమతులు తీసుకోవడం వైపు దృష్టిసారించారు.హెచ్‌ఎండిఎ విస్తరిత ప్రాంతాన్ని ప్రణాళికా విభాగం సౌలభ్యం కోసం శంకర్‌పల్లి, శంషాబాద్, మేడ్చెల్, ఘట్‌కేసర్ అనే నాలుగు జోన్‌లు చే యడం జరిగింది. వీటిల్లో రెండు జోన్‌లకు ఒక డైరెక్టర్‌గా ఇద్దరు డైరెక్టర్‌లుగా ఉన్నారు. ఈ డైరెక్టర్ల కింద పనిచేసే బృందాలు సమయానుకూలంగా నివేదికలు అందించడంతోనే ప్రణాళికా విభాగపు ఆదా యం ఆధారపడి ఉంటుంది. అయితే, డిపిఎంఎస్ విధానంలో ఆన్‌లైన్ పద్దతి వచ్చిన తర్వాత పెరుగుతున్న దరఖాస్తులకు అనుగుణంగా డైరెక్టర్లు సమయానికి మించి పనిచేస్తుండటంతోనే అథారిటీ వైపు మొగ్గుచూపుతున్నామని రియల్టర్లు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి ప్రణాళికా విభాగంపై పనిభారం తడిసిమోపెడుగా మారుతోంది. వస్తున్న దరఖాస్తులకు అ నుగుణంగా సరిపడా అధికారులు లేరు. అయితే, డైరెక్టర్లలో ఒకరు అదనపు బాధ్యతలున్నా సమయానుకూలంగా దరఖాస్తులను పరిష్కరిచండం, మరో డైరెక్టర్ నిత్యం అందుబాటులో ఉండటంతో పనిభారాన్ని సమతుల్యం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క నీసంగా 250 మంది వరకు అధికారులు ఉండాలి. కానీ, కేవలం 80 మంది వరకే పనిచేస్తున్నారు. అ ందులో సుమారు 50 మంది వరకు ఇతర విభాగాల కు చెందినవారు డిప్యూటేషన్‌పై హెచ్‌ఎండిఎకు వ చ్చారు. వీరు దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంలేకుండా చూడటం, దరఖాస్తుదారులు నేరుగా కలిసేందు కు కూడా సమయాన్ని కేటాయించడంతో ఆదాయం పెరుగుతోంది.అథారిటీలో కీలక జోన్‌లుగా ఉన్న శంకర్‌పల్లి, శం షాబాద్‌లకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బాలక్రిష్ణ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఆ యనకున్న అదనపు బాధ్యతలకు కూడా సమయాన్ని కేటాయిస్తూ సంస్థకు ఆదాయవనరులైన లేఅవుట్లు, నిర్మాణాలు, ఎన్‌ఓసిల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స మయానుకూలంగా పరిష్కరించడంతో ఈ ప్రాంతం నుంచి అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. రియల్టర్లు కూడా తమతమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి సాంకేతిక సమస్యలను నివృత్తి చేయడంతో గతంలో అథారిటీకి ఉన్న ప్రచారం కాస్త కనుమరుగవుతోందని రియల్టర్లు స్పష్టంచేస్తున్నారు