యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈనెల 11న జరగనున్న ఢిల్లీ ఆందోళన విజయవంతం చేయాలి. ఢిల్లీ వేదికగా మన ధర్మపోరాటం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అయన పార్టీ నేతలు, ఎంపీలు. ఎమ్మెల్యే లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు,ప్రజా సంఘాలంతా రాష్ట్రం వైపు. ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఎవరు రాష్ట్రం కోసమో..ఎవరు రాజకీయాల కోసమో. 11న ఢిల్లీ ఆందోళనే తేలుస్తుందని అన్నారు. ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలి. రాకపోతే దానిపై ప్రజలే నిర్ణయిస్తారు. బిసిలకు సబ్ ప్లాన్ చట్టబద్దత ఇస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250కోట్లు ఆదేశాలు ఇచ్చాం. అందరి భవిష్యత్తు మోది అంధకారం చేశారు. గాయాలను కెలికి పెద్దవి చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ హక్కులపై దాడులు చేస్తున్నారు. 23పార్టీల మహాకల్తీ అనడం మోది దిగజారుడుతనం. నరేంద్ర మోది మాటల గారడి-జగన్మోహన్ రెడ్డి మోసాల గారడి. కేంద్రంలో బిజెపి పాలనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని అభినందించిన సీఎం టిడిపి ఎంపిల స్ఫూర్తి అందరిలో రావాలని అన్నారు. మంచిని మంచిగా చెప్పే ధైర్యం బిజెపికి లేదు. చెడును చెడుగా చెప్పే ధైర్యం బిజెపికి లేదని విమర్శించారు.