యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీకాకుళం పట్టణంలో గురువారం జరిగిన అత్తాకోడళ్ల దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. . దుండగులు మృతుల కళ్లలో కారంకొట్టి, ఆపై ఒకరిని కత్తులతో నరికి, మరొకరిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణంగా చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. పట్టణంలోని బొందిలీపురం విజయ్‌నగర్ వీధిలో ఒక అపార్ట్ మెంట్ లో వుంటున్న జీలానీ చెప్పుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇంట్లో జిలానీతోపాటు అతని భార్య మొహరున్నీసా, (35), తల్లి జూరాబాయి (70), పిల్లలు జాఫర్ (15), దిషన్ (12) ఉంటున్నారు. వ్యాపారం పనిమీద గురువారం ఉదయం జిలానీ బయటకు వెళ్లడు . ఇంట్లో అత్తాకోడళ్లు మాత్రమే ఉండే సమయంలో దుండుగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ముందుగా మొహరున్నీసా కంట్లో కారంచల్లి అనంతరం కత్తులతో దాడిచేశారు. ఆమె మెడ, కాళ్లు, చేతులు కోసేశారు. తరువాత వంటింట్లో ఉన్న జూరాబాయి కంట్లోను కారంకొట్టి, తర్వాత క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశారు. దారుణమైన ఈ ఘటనలో అత్తాకోడళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్కూలుకు వెళ్లిన జిలాని పెద్దకొడుకు జాఫర్ సాయంత్రం ఇంటికి వచ్చాక ఈ దుర్ఘటన వెలుగు చూసింది. అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్ లేకపోవడం, సీసీ కెమెరాలు కూడా అమర్చక పోవడంతో పోలీసులకు ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. జంట హత్యలతో పాటు కొంత నగదు, బంగారాన్ని అపహరించారని జిలానీ పోలీసులకు సమాచారమిచ్చాడు.