YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

‘రోటోమాక్’పై ఐటీశాఖ కొరడా.. 

Highlights

  • ఆదాయుపన్ను ఎగవేశారంటూ ఆరోపణలు
  • 11 బ్యాంకు ఖాతాలు ఎటాచ్ 
  • రూ. 85 కోట్ల రికవరీ కోసమే ఖాతాల స్తంభన.. 
  • కొఠారీ తీసుకున్న రుణం రూ. 2919 కోట్లు
  • వడ్డీతో కలిపి ఇప్పటికి రూ. 3695 కోట్లు.. 
  • విక్రమ్‌పై మనీలాండరింగ్ కేసు పెట్టిన ఈడ
‘రోటోమాక్’పై ఐటీశాఖ కొరడా.. 

ఆదాయుపన్ను ఎగవేశారంటూ రోటోమాక్ గ్రూపు అధినేత విక్రమ్ కొఠారీపై చర్యలకు రంగం సిద్ధం చేసింది.ఆ గ్రూపుతో సంబంధం ఉన్న 11 బ్యాంకు ఖాతాలను ఎటాచ్ చేసింది.  కొఠారీ దాదాపు రూ. 85 కోట్ల మేర పన్నులు చెల్లించాల్సి ఉందని, వాటిని రికవరీ చేసుకోడానికే  ఈ ఎటాచ్‌మెంట్ అని చెబుతున్నారు. గత నెలలో కూడా ఇదే గ్రూపునకు చెందిన మూడు ఖాతాలను ఆదాయుపన్ను శాఖ ఎటాచ్ చేసింది.ఆదాయుపన్ను ఎగవేతలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా కొఠారీకి చెందిన రోటోమాక్ గ్రూపుపై రావడంతో ఈ చర్యలు తీసుకుంది  ఇప్పటికే ఒకైవెపు సీబీఐ, మరోైవెపు ఈడీ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతుండగా ఇప్పుడు ఆదాయుపన్ను శాఖ కూడా రంగంలోకి దిగింది. 
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కేంద్రంగా కొనసాగుతున్న రోటోమ్యాక్ గ్రూపు మొత్తం ఏడు బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 3695 కోట్ల మేర రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిందని సీబీఐ, ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మీద, దాని డైరెక్టర్ విక్రమ్ కొఠారీ, ఆయన భార్య సాధనా కొఠారీ, కొడుకు రాహుల్ కొఠారీపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఈ ముగ్గురితో పాటు గుర్తుతెలియని బ్యాంకు అధికారులపై కూడా కేసు పెట్టారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోైదెంది. కొఠారీ తీసుకున్న మొత్తం రుణం రూ. 2,919 కోట్లని.. వడ్డీతో కలిపి రూ. 3695 కోట్లకు చేరిందని సీబీఐ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కొఠారీపై మనీలాండరింగ్ కేసు పెట్టింది. ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న మొత్తాలను కూడా విదేశాలకు ఏమైనా పంపేశారా.. వాటి సాయంతో అక్రమంగా ఏమైనా ఆస్తులు సంపాదించి, నల్లధనం పోగేశారా అనే కోణాలలో ఈడీ దర్యాప్తు చేయునుంది.

Related Posts