
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
టీమిండియా లెక్క సరి చేసింది. ఆక్లండ్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు కివీస్ ను కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. రోహిత్ శర్మ (50), ధావన్ (30), రిషభ్ పంత్ రాణించారు. సిరీస్‌ను 1-1తో సమం చేసింది.