YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీసీలు చంద్రబాబుకు మద్దతివ్వాలి

బీసీలు చంద్రబాబుకు మద్దతివ్వాలి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

బిసిలకు ఇచ్చిన వాగ్ధానాలు అన్నీ నెరవేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు  చరిత్ర సృష్టించారు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్. గట్టి మేల్ తలపెట్టవోయ్ అని గురజాడ మాటల స్పూర్తిగా  రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఇచ్చిన వాగ్ధానాలకు వాస్తవ రూపం కల్పించారని ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి అన్నారు. బిసిల కలలు నెరవేరుతున్నాయ్. బిసి సబ్ ప్లాన్ కు బడ్జెట్ లో 3వ వంతు కేటాయింపులు చట్ట బద్దత చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.  బిసిలకు ఇంత పెద్దపీట వేసిన రాష్ట్రం,  దేశంలో ఏదీ లేదు. రాజమండ్రి జయహో బిసి మహాసభలో ఇచ్చిన హామీ మేరకు బిసి కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులు మంజూరు చేశారు. కులవ్రుత్తుల పై ఆధారపడిన బిసిలకు ఆర్ధిక సహాయం అందించి  తమ కాళ్ళ పై తాము నిలబడేటట్లు భరోసా కల్పించారు. చంద్రబాబు  తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలకు నా తరుపున, బిసిల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.  దేశంలో శుష్క ప్రియాలు చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయవేత్తలను చూస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ కి ఎంతో చేస్తానని ప్రగల్భాలు పలికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోడీ. రాష్ట్ర ప్రజలకు మొండి చేయి చూపించిన ఘనుడని అన్నారు. తమ స్వార్ధం కోసం ప్రతిపక్షనాయకులు రాష్ట్ర ప్రయోజనాలను కూడా పణంగా పెట్టారు. అధికారమే ఎజెండాగా అమలుపర్చలేని హామీలు ప్రకటిస్తూ ప్రతిపక్షనాయకుడు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.  శైశవ దశలో వున్న ఆంధ్రప్రదేశ్ తన కాళ్ళ మీద నిలబడాలంటే చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మరో పదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలి.
దీనికి మన బిసిలందరూ సమైఖ్యంగా ఆయన వెనుక నిలబడాలని అన్నారు.

Related Posts