యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆత్మ స్తుతి పరనిందలాగా టిడిపి ప్రభుత్వం తీరు ఉంది. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు పధకాల పేరు మార్చి వాడుకుంటున్నారు. అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ అధికారంలోకి రావాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని బిజేపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడి అమలు చేస్తున్న పధకాలకు కూడా చంద్రబాబు తన పొటో వేసుకుని ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు లు, నిధులను మళ్లించిన చంద్రబాబు బిజెపి పేనే ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయ కారణాలతో బయటకు వచ్చిన బాబు, మోడి ఎపి పర్యటన ను అడ్డుకుంటామని చంద్రబాబు తో సహా పలువురు నేతలు ప్రకటిస్తున్నారని అయన అన్నారు. పోలవరం , యూనివర్శిటీ లు, నిధులు ఇచ్చినందుకు అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. విడుదల చేసిన నిధుల లెక్కలు చెప్పకుండా మా పైనే విమర్శలు చేస్తున్నారు. ఎపికి అన్యాయం జరిగిందంటూ దొంగ దీక్షలు చేయడమే కాక, కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ లో దీక్ష పేరుతో మరోసారి ప్రజల డబ్బును వృధా చేసేందుకు సిద్ధమయ్యారు. మోడి పై అసహనం వ్యక్తం చేస్తూ, విషం కక్కుతూ చంద్రబాబు స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారు.వరుసగా నాలుగు సార్లు సిఎం అయిన మోడి, మరోసారి ప్రధాని అవుతున్నారనే ఈర్ష్య, ద్వేషం చంద్రబాబు లో నెలకొందని అన్నారు. ఏనాడైనా మీరు వరుస ఎన్నికలలో గానీ, మరొకరి సాయం లేకుండా గెలిచారా.
బాబు తన స్వలాభం కోసం కాంగ్రెస్ తో, రాహుల్ గాందీ తో కలిశారు. టిడిపి లో ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ కు కోవర్టు గా పని చృస్తున్నారా అనే నుమానం కలుగుతుందని అన్నారు. గతంలో యన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన సిద్దాంతాలు కూడా మంట కలిపేశారు. మా పార్టి నేత వెంకయ్యనాయుడు గురించి మీరెలా ప్రకటనలు చేస్తున్నారు. ఆయన చేసిన సేవలకు రాష్ట్రపతి పదవిని ఇచ్చి మా పార్టీ గౌరవిస్తే మీకెందుకు నొప్పని అన్నారు. వైసిపి, బిజెపి లు కలిసిపోయి రాజకీయాలు చేస్తున్నాయంటున్న టిడిపి నేతలు ఆధారాలు చూపించండి. ప్రతిపక్ష పార్టితో మాట్లాడకూడదని ఉందా... మీరు నేరుగా కాంగ్రెస్ తో కలిస్తే మాత్రం తప్పు లేదా అని నిలదీసారు. చంద్రబాబు కు భవిష్యత్తు తెలిసిపోవడం ద్వారా ఆయనలో అసహనం పెరిగిపోతుందని అన్నారు.