YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

మహాత్మా గాంధీ తత్వం, ఆచరణ. 

Highlights

  • భారతీయ తత్వశాస్త్రం.     
  • భారత దేశము 
  • ఆధునిక యుగము.
మహాత్మా గాంధీ తత్వం, ఆచరణ. 

 గాంధీజీ సత్యాగ్రహం అనే ఆయుధాన్ని జాతి ప్రత్యర్థిపైన, మన జాతి అంతర్గత శత్రువుపై ద్వివిధాలుగా ప్రయోగించాడు.

గాంధీ తన సత్యాగ్రహమనే ఆయుధాన్ని ఒకవైపు తన జాతి ప్రతిద్వంది అయిన శత్రువుపై ప్రయోగించాడు. మరోవైపు మన సమాజంలో శతాబ్దాలుగా పేరుకుపోయిన సమాజిక రుగ్మతలు, ఘోరదురాచారాలపైనా ప్రయోగించాడు.
      గాంధీ భారతీయ సమాజంలోని వర్ణాల మధ్య, కులాలమధ్య, ఎక్కువతక్కువలను వ్యతిరేకించాడు. కు, మత, విభేదాలను, వ్యత్యాసాలను ఖండించాడు.
      కాని ఆయన ప్రధానంగా పోరాడింది అస్పృశ్యతా దురాచారంపైన, అయినా వర్ణాశ్రమ ధర్మాలను, వర్ణవ్యవస్ధను వ్యతిరేకించ వలసిందేమి లేదని వాటిని సమర్థించాడు.

అస్ఫృశ్యతను వ్యతిరేకించిన గాంధీజీ.
 గాంధీ వర్ణవ్యవస్థను సమర్థించినా అస్పృశ్యతను మాత్రం పూర్తిగా, నిర్ధ్వందంగా ఖండించాడు. అసహ్యించుకున్నాడు.
అంటరానివారుగా ముద్రవేసి, సమాజానికి దూరంగా శతాబ్దాలుగా వెలివేసిన దళిత ప్రజల సముద్ధరణకు అస్పృశ్యతా నిర్మూలనకు అహర్నిశలు  గాంధీజీ కృషిచేశాడు.
అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించి మిగిలిన వర్ణాలతో సమానంగా సామాజిక న్యాయాన్ని , గౌరవ ప్రతిపత్తులను కల్పించడాన్ని తన జీవిత ధ్యేయాలలో ఒకటిగా గాంధీజీ భావించాడు.
అస్పృశ్యులకు ఆయన హరిజనులు అని పేరు పెట్టారు. అంటే వారు దేవుని సంతానం అని ఆయన భావన.
 అస్పృశ్యులుగా పరిగణించి వారిని శతాబ్దాలుగా అణగద్రొక్కిన వర్ణాల వారిని ఆయన సైతాను సంతానం అని భావించాడు.

అస్పృశ్యతా నిర్మూలనా ప్రచారం కొరకు 'హరిజన్'  పత్రికను ప్రారంభించిన గాంధీ.

1932లో హరిజనులను తక్కిన హిందువుల నుండి విడదీసి విబేధాలను శాశ్వతం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం దురుద్దేశ్యంతో ప్రకటించిన "కమ్షూనల్ అవార్డును" గాంధీజీ కఠోర నిరాహార దీక్షతో వ్యతిరేకించాడు.

 అస్పృశ్యతా నిర్మూలనకై తన భావాల ప్రచారం కొరకూ గాంధీ 1933లో హరిజన్ అనే వారపత్రికను ప్రారంభించాడు.
తను నివాసముంటున్న ఆశ్రమంలో హరిజనులను చేర్చుకున్నాడు. బొంబాయిలో కాని, డిల్లీలో కాని గాంధీ హరిజనుల భంగీ కాలనీలలోనే బస చేసేవాడు.
 గాంధీ అస్పృశ్యతా నిర్మూలనకై దశాబ్దాల పాటు రాజీలేని పోరాటం కొనసాగించిన హరిజనేతరుడు ఇంకేవరూ లేరనటంలో సందేహం లేదు.

                                                                      --- బండారు వెంకటేశు. (సత్యాన్వేషి)

 

Related Posts