యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి కుమార స్వామి. డబ్బు, పదవులు ఎరవేసి తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేస్తున్నారని.. దేశానికి రక్షకుడిగా చెప్పుకుంటున్న మోడీ.. అవినీతిని ప్రొత్సహిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం విధానసౌధలో మాట్లాడిన కుమార స్వామి.. బీజేపీపై ఫైరయ్యారు.
బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడకు డబ్బు ఎరవేశారని ఆరోపించారు కుమార స్వామి. దీనికి సంబంధించి ఓ ఆడియో టేపును విడుదల చేశారు. నాగన్న గౌడ కుమారుడు శరణకు యడ్యూరప్ప ఫోన్ చేసి తమకు మద్దతిస్తే రూ.లక్షల్లో డబ్బు.. మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారన్నారు. దీనిపై ఆధారాలతో సహా రుజువు చేస్తానన్నారు. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడట్లేదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక వైపు మాత్రం ప్రధాని మోదీ సత్యాలు వల్లెవేస్తున్నారు. మరోవైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు అని కుమారస్వామి మండిపడ్డారు. ఓ వైపు ప్రధాని మోదీ నీతి వాక్యాలు, సత్యాలు అంటూనే వల్లె .. మరో వైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బల నిరూపణకు సిద్ధమన్నారు.