యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రఫేల్ డీల్ అంశంలో ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర సంప్రదింపులు జరిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించించిది. అయితే ఆ రిపోర్ట్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఇవాళ లోక్‌సభలో ఆమె మాట్లాడారు. దురుద్దేశంతో ఆ రిపోర్ట్‌ను ప్రచురించారన్నారు. రఫేల్ ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రక్షణశాఖ పంపిన నోటీసుకు.. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బదులు ఇచ్చారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఆ లేఖలో పారికర్ తెలిపారన్నారు. రిపోర్ట్‌ను ప్రచురించడం అంటే చచ్చిన గుర్రాన్ని మళ్లీ మళ్లీ కొట్టడమే అన్నారు. రఫేల్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్ ఆమె తోసిపుచ్చారు. ఫ్రాన్స్ వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వాటి తయారీ కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌కు ఎందుకు అప్పగించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం తారాస్థాయికి చేరుకున్నది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న రఫేల్ ఒప్పందం విషయంలో ఆంగ్ల దినపత్రిక ద హిందూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ఇప్పుడు వివాదం రేపుతున్నది. రఫేల్ ఒప్పందంపై ప్రధాని మంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది. యుద్ధ విమానాల కొనుగోలుపై రక్షణ శాఖ చేసుకున్న ఒప్పందాన్ని పీఎంవో దాటవేసినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. రఫేల్ అంశంపై పీఎంవో అనైతిక ప్రక్రియను అవలంబించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్‌తో రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంటున్న సమయంలో.. పీఎంవో జోక్యం చేసుకోవడాన్ని డిఫెన్స్ సెక్రటరీ అడ్డుకున్నారు. 2015, నవంబర్ 24న దీనికి సంబంధించిన ఓ నోటీసును కూడా అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు పంపారు. పీఎంవో జోక్యం చేసుకోవడాన్ని రక్షణ కార్యదర్శి జీ మోహన్ కుమార్ వ్యతిరేకించారు. ఫ్రెంచ్ ప్రభుత్వంతో రఫేల్ అంశంపై పీఎంవో అధికారులు ఎటువంటి సంప్రదింపులు జరపరాదు అని డిఫెన్స్ కార్యదర్శి తన నోటీసులో కోరారు.