YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

'సచివాలయం'లో సైకిళ్ల సవారీ...!

Highlights

  • బైక్‌ రైడింగ్‌ కు 
  • నెస్ట్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం
  • ఒక్కో సైకిల్‌ కు లక్ష రూపాయలు
  • ప్రతి కి.లో మీటరకు ఒక బైక్‌ స్టేషన్‌
  • రాజధాని చుట్టుపక్కల 1670 కి.మీటర్లలో బైక్‌ రైడింగ్‌
'సచివాలయం'లో సైకిళ్ల సవారీ...!


ఆంధ్రప్రదేశ్‌ నూతన సచివాలయంలో ఇప్పుడు ఎటు చూసినా సైకిళ్ల సందడి కనిపిస్తోంది. నూతన పరిపాలనా భవనంలో పలువురు ఉద్యోగులు, జర్నలిస్టులు..సాయంత్రం..మధ్యాహ్నం నుంచి సైకిళ్లపై సవారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో..సాయంత్రం పూట..సైకిళ్లు తొక్కుతూ సందడి చేస్తున్నారు. ఒకేసారి పదుల సంఖ్యలో సైకిళ్లను తొక్కుతూ...ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా...ప్రభుత్వం సైకిళ్ల సవారీని ప్రోత్సహిస్తోంది. నెస్ట్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని..దాదాపు 30 సైకిళ్లను సచివాలయ చుట్టుపక్కల అందుబాటులో ఉంచింది. ఒక్కో సైకిల్‌ కు దాదాపు లక్ష రూపాయలు చెల్లించి ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. సిఆర్‌డిఎ,ఆల్‌ ఇండియా బైక్‌ ఫెడరేషన్‌ మరియు నెస్ట్‌ బైక్‌ ఆర్గనేజేషన్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ బైక్‌పై రైడింగ్‌ అద్బుతంగా ఉందంటున్నారు సచివాలయ ఉద్యోగులు. గేర్లతో కూడిన సైకిల్‌ కావడంతో..తొక్కడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉందని...రైడర్‌కు ఎలా కావాలంటే ఆ విధంగా గేర్లు మార్చుకుంటూ వెళ్లవచ్చని చెబుతున్నారు. 
  ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి సైకిళ్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో రాజధాని చుట్టుపక్కల 1670 కి.మీటర్లలో బైక్‌ రైడింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తామని సిఆర్‌డిఎ అధికారులు చెబుతున్నారు. ప్రతి కి.లో మీటరకు ఒక బైక్‌ స్టేషన్‌ ఉంటుందని..ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో మాత్రమే సైకిళ్ల రైడింగ్‌ ఉంది. ఈ బైక్‌పై రైడింగ్‌ చేయాలంటే నెస్ట్‌ సంస్థ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలి. అక్కడ రిజిస్టర్‌ అయిన తరువాత...మొబైల్‌ యాప్‌ను ఉపయోగించి..సైకిళ్లను రైడింగ్‌ కోసం తీసుకెళ్ల వచ్చు. మొత్తం మీద...సచివాలయంలో సైకిళ్ల హడావుడితో సందడి నెలకొంది. సాయంత్రం సమయంలో బైక్‌ల కోసం పలువురు ఉద్యోగులు..సందర్శకులు పోటీ పడుతున్నారు. ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకునే వారు..ఈ సైకిళ్ల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న బైక్‌లకు అదనంగా మరి కొన్నింటిని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

Related Posts