YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇబ్బందులొచ్చినా పోలవరం పూర్తి చేస్తాం

ఇబ్బందులొచ్చినా పోలవరం పూర్తి చేస్తాం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రసంగించారు. నదులు అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతొంది.గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసి రాయలసీమ, కృష్ణా డెల్టాకు నీరు అందించామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పూర్తిచేస్తాం. కేంద్రప్రభుత్వం కక్షతో పోలవరానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. కేంద్రప్రభుత్వానికి ఉన్న అధికారులను ఉపయోగించి మనకు రావాల్సిన నిధులు రాకుండా చేస్తున్నారు. విభజన సమయంలో పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలని అనేక సార్లు ఆడిగినప్పటుకి 14వ ఫైనాన్స్ కమీషన్ ను అడ్డం పెట్టుకొని ఇవ్వడం కుదరదని జైట్లీ చెప్పారు. ప్రత్యేక హోదాకు సరిసమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పారు కానీ పైసా కూడా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం2017లో 9 రాష్ట్రాలకు హోదాను కొనసాగించారు. 9 రాష్ట్రాలకు హోదా కొనసాగించిన తర్వాత కూడా ఏపీకి హోదా ఇవ్వాలని ఒత్తిడి చేసినా కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెరిగితాయి. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బ్రహ్మడమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలు చేసాం. ఈ ఐదు సంత్సరాలు రూ.7 లక్షలు రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు బడ్జెట్లో కేటాయింపులు పూర్తి ఖర్చు జరిగేదికాదు కానీ ముఖ్యమంత్రి కృషి వల్ల బడ్జెట్లో కేటాయింపుల కంటే అదనంగా ఖర్చు చేసాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగింది. రాష్ట్రం తరుపున, ప్రజలతరపున మాట్లాడతారని శాసన సభ్యులను సభకు పంపిస్తారు కానీ ప్రతిపక్షం సభకు రాకుండా పారిపోయిందని అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం సభకు రాకుండా పారిపోయిన వారికి ఓట్లు వేసినా దండగే. రాజ్యాంగంలో ఉన్న విషయాలు ప్రతిపక్షానికి తెలియదు. 10వ షెడ్యూల్ లో ఉన్న అంశాలను గమనించకుండా ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంది తప్ప ఎవరికి లేదు. ప్రజాసమస్యలపై మాట్లాడారు కానీ సీఎం కుర్చీ కోసం చూస్తున్నారు. పాదయాత్ర ప్రజలకోసమో, రాష్ట్రం కోసమో కాదు కేవల సీఎం కుర్చీ కోసమే పాదయాత్ర చేస్తున్నారు. జీతాలు, అలెవెన్స్ లు తీసుకుంటారు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభకు రారు. పీఏసీ చైర్మన్ కు ఇచ్చిన రాష్ట్రానికి చెందిన విలువైన పత్రాలు మోడీకి ఇస్తున్నారు. ప్రివిలేజ్ మోషన్ పెడతామంటే మాట మార్చారు. ఉద్యోగులకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 24 సమస్యలు పరిష్కరించింది. గవర్నర్ పాలనలో దాదాపు 17 వేల కోట్లు రెవిన్యూ లోటు ఏపీకి ఉంటుందని కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపారని అన్నారు. రెవిన్యూ లోటు ఏపీకి ఇవ్వాలని కాగ్ చెప్పినా కేంద్రం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు రెవిన్యూ లోటు ఇస్తామని చెప్పి రూ.3 వేల కోట్లు పైచీలుకు మాత్రమే ఇచ్చారు. వెనకబడిన జిల్లాకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ప్రధాని పరిమిషన్ ఇస్తే డబ్బు ఇస్తామని చెప్పారని చెప్పారు.

Related Posts