YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

యూఎస్‌ కాంగ్రెస్‌ ముందుకు గ్రీన్‌కార్డుల కోటా బిల్లు

 యూఎస్‌ కాంగ్రెస్‌ ముందుకు గ్రీన్‌కార్డుల కోటా బిల్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే కోటాను ఎత్తివేసే దిశగా ముందడుగు పడింది. దేశాల కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ తీసుకొచ్చిన బిల్లు తాజాగా అమెరికా కాంగ్రెస్‌ ముందుకొచ్చింది. ఉద్యోగం ఆధారంగా జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో దేశాల కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ ఫేర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ బిల్లును సెనేట్‌లో రిపబ్లిక్‌ సభ్యుడు మైక్‌ లీ, డెమోక్రటిక్‌ సభ్యురాలు కమలా హారిస్‌ ప్రవేశపెట్టారు. ఇక ప్రతినిధుల సభలోనూ సభ్యులు ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికా కాంగ్రెస్‌లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అధ్యక్షుడి సంతకంతో ఇది చట్టరూపం దాల్చుతుంది.ఈ చట్టం అమల్లోకి వస్తే ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే. హెచ్‌-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చాలా మంది భారతీయులు దేశాల కోటా కారణంగా గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కోటాను తీసేసి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు జారీ చేస్తే భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతారు.ప్రస్తుతం అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తోంది. వీటిలో 7 శాతానికి మించి ఒక దేశానికి కేటాయించదు. ఈ పరిమితి కారణంగా మిగతా దేశాలకు చెందిన వారితో పాటు భారత్‌, చైనాకు చెందిన వ్యక్తులు గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రెండు దేశాల నుంచి గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య ఏటా లక్షల్లో ఉంటుంది. తాజా బిల్లు అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇది అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభపరినామంగా చెప్పవచ్చు.

Related Posts