Highlights
- డీఈడీ విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ
- ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరణ
ఏపీలో డీఈడీ కోర్సుల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని డీఈడీ విద్యార్థులు ఆరోపించారు. విద్యాసంవత్సరం ముగిసినా వార్షిక పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేస్తున్నారని, అధికారుల ధనదాహమే దీనికి ప్రధాన కారణమని మండిపడుతున్నారు. ఈ మేరకు కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీఎన్ డీఈడీ కాలేజీకి చెందిన 2016-18 బ్యాచ్ విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పేర్కొంటూ విచారణకు స్వీకరించిన కోర్టు.. వివరాలతో కౌంటర్ వేయాలంటూ రాష్ర్టానికి నోటీజు జారీ చేసిం