ఇద్దరు ఏడో తరగతి విద్యార్థులను తలకిందులుగా గోడకు కాళ్లు పెట్టించి. ఎస్టీ హాస్టల్ వార్డెన్ పైపుతో చితక్కొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనను కొందరు విద్యార్థులు రహస్యంగా వీడియో తీయడంతో ఆ వార్డెన్ దారుణ తీరు వెలుగులోకొచ్చింది. వార్డెన్ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ఇద్దరు విద్యార్థుల పేర్లు లక్ష్మణ్, పరమేశ్వర్. వారు అల్లరి చేస్తున్నారన్న చిన్న కారణంతో వార్డెన్ యాదయ్య ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఆ పిల్లలు తమని కొట్టొద్దని వేడుకుంటున్నప్పటికీ ఆ వార్డెన్ వినలేదు. పైప్‌తో కొడుతూ రాక్షసానందం పొందాడు...