తుమ్మును ఆపుకోవడానికి ముక్కును నొక్కడం, నోరును బిగించి ఉంచడం వల్ల మరణం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దానివల్ల గాలి బుడగలు గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరి ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ లీచెస్టర్‌కు చెందిన భారత సంతతి వైద్యులు రఘువిందర్ ఎస్ సహోతా, సుదీప్ దాస్ తెలిపారు. 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపుకోవడం వల్ల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరగా.. స్కానింగ్‌లో గుండె కణజాలాల్లో గాలి బుడగలు గుర్తించామని తెలిపారు.