YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో స్కాం

Highlights

  • రూ. 8కోట్ల 94లక్షల 89వేలు మాయం 
  • కేసు నమోదు చేసిన సి.బి.ఐ
  • పది.మంది.నిందితులు
  • అందరూ బ్యాంకు ఉద్యోగులే..
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో స్కాం

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాల నుంచి అక్షరాల 8కోట్ల 94లక్షల 89వేల రూపాయల నగదు మాయమైంది.

1976లో ప్రారంభమైన తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జులై, 2010 నుంచి 19, పిభ్రవారి 2018 మధ్యలో యాభై మంది ఖాతాదారులకు చెందిన 8కోట్ల 94లక్షల 89వేల రూపాయల నగదు గల్లంతైనట్లు ఈనెల 7న సి.బి.ఐ. ఏ.సి.బి. కి ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ మందాల రవీందర్ రెడ్డి లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. పిర్యాదు మేరకు సి.బి.ఐ. ఈనెల19న కేసు ( నెంబరు: RC 01(A) /2018-CBI-HYD, Srctions: 120B r/w, 420, 468, 471, 477A ) నమోదు చేసింది. 
ఎఫ్.ఐ.ఆర్. లోని విషయాలు ఇలా ఉన్నాయి.
నిందితులు వీరే:
సి.బి.ఐ. నమోదు చేసిన కేసులో మెత్తం 10 మంది బ్యాంకు ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. వీరిలో ఆఫీసు తాత్కాలిక పార్టుటైం  స్వీపర్ తో పాటు ఒక రిటైర్ ఉద్యోగి కూడా ఉన్నారు.

అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆఫీసు అసిస్టెంట్ మాది జైపాల్ రెడ్డి, బ్యాంకు మేనేజర్ జె.మోజెస్, బ్రాంచ్  మేనేజర్ కె. లక్ష్మీ నర్సయ్య,బ్రాంచ్  మేనేజర్ కె.చంద్రయ్య,బ్రాంచ్  మేనేజర్ జి. శ్రీనివాసరావు,బ్రాంచ్  మేనేజర్ ఈ. రాజన్న,బ్యాంకు అధికారి, ప్రస్తుతం వెలిమినేడులో పనిచేస్తున్నబి. రవికాంత్,రిటైర్ ఉద్యోగి వి.వి.జె.రామారావు, బ్యాంకు ఎకౌంటెంట్ పి.గురుప్రసాద్, తాత్కాలిక పార్టుటైం  స్వీపర్ మాది శ్రీనివాస రెడ్డి ఉన్నారు.
బ్యాంక్‌లో శాఖపరమైన ఆడిటింగ్‌ జరుగుతుండగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌లో జరిగిన అవకతవకలపై బాధ్యులను గుర్తించేందుకు శాఖపరమైన విచారణ అనంతరం కథ సి.బి.ఐ.కి చేరింది.

Related Posts