యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అర్థంపర్థం లేని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కామెడీ కితకితలు ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు హుద్‌హుద్ తుఫాన్ లాంటి వారని, తుఫాన్ల కంటే ఎక్కువగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించిన విజయసాయిరెడ్డి తాజాగా ఏపీ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కామెడీ కితకితలు ఆపండి బాబూ. కిందటి సారి సీఎంగా ఉన్నపుడు జనాభా తగ్గించాలని చిటికేస్తే జననాల రేటు భారీగా తగ్గిపోయిందట. ఇప్పుడు జనాభా అర్జంటుగా పెంచాలంట. లేకపోతే చైనా, జపాన్లలాగా జనాభా క్షీణించే ప్రమాదముందని చంద్రం సారు భయపెడుతున్నాడు. ఏమిటీ అర్థం లేని పిచ్చి మాటలు?’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కామెడీ కితకితలు ఆపండి బాబూ. కిందటి సారి సిఎంగా ఉన్నపుడు జనాభా తగ్గించాలని చిటికేస్తే జననాల రేటు భారీగా తగ్గిపోయిందట. ఇప్పుడు జనాభా అర్జంటుగా పెంచాలంట. లేకపోతే చైనా, జపాన్లలాగా జనాభా క్షీణించే ప్రమాదముందని చంద్రం సారు భయపెడుతున్నాడు. ఏమిటీ అర్థం లేని పిచ్చి మాటలు?ఎన్నికలు దగ్గర పడ్డాయంటే చాలు బాబు జిమ్మిక్కులు మొదలుపెడతారని విమర్శించారు. ‘అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడతారని.. కానీ అందుకోసం వెచ్చించిన ఖర్చులో సగం కూడా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలంటే బాధ పడతారంటూ ఎద్దేవా చేశారు. ప్రశ్నల వర్షం కురుస్తోంది, ప్రజల నుంచి చంద్రబాబు ఇక తప్పించుకోలేరంటూ’ మరో ట్వీట్ సంధించారు విజయసాయిరె