యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గవర్నర్ కి సుదీర్ఘంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పై వివరించాం. దొంగ సర్వే ల పేరుతో గవర్నమెంట్ ప్రజా సాధికార సర్వే పెరు తో ప్రజల అభిప్రాయం తెలుసుకుంటు ఆ సేర్వే ల ఆధారంగా వైసీపీ కి సంబంధించిన ఓట్లు తొలగించిందని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం అయన గవర్నర్ లో భేటీ అయిన తరువాత మీడియాతో మాట్లాడారు. పోలీస్ యంత్రాంగం ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్వార్ధం కోసం స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు దీక్ష ఒక వ్యక్తి ని తనే పొడిచి మళ్ళీ ఆ హత్య కు వ్యతిరేకంగా దీక్ష చేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉందని అయన అరోపించారు. ప్రత్యేక ప్యాకేజి ని అరుణ్ జైట్లి ప్రకటించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు పొగిడారు బీజేపీ ప్రభుత్వం లాగా ఎవరైనా చేసారా అని. ఇదే బీజేపీ ప్రభుత్వం ఠీ సంసారం చేసి 4 ఏళ్ల తరువాత నల్ల చొక్కా వేసుకొని పోరాటం చేస్తున్నారని అన్నారు. మరో వైకాపా నేత బుగ్గన రాజేంద్ర నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఓట్లు తొలగించారు. నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారు 60 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. సర్వే ల పెరు తో ప్రజల ను ప్రశ్నించినప్పుడు వారు ఏ పార్టీ కి ఓటు వేస్తారు అన్నప్పుడు వైసీపీ వాళ్ళ ఓట్లు తొలగించారు. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నదని తెలిసి చెక్కుల పేరుతో పథకాలు ప్రవేశపెడతున్నారు. పోలీస్ ,రెవెన్యూ శాఖ లో ఎన్నికలు వస్తున్నాయి అని తెలిసి వారికి కావలిసిన విధంగా బదిలీలు చేస్తున్నారని విమర్శించారు.