YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తొలి మహిళా రైల్వేస్టేషన్

Highlights

  • జైపూర్‌లోని గాంధీనగర్‌లో.
తొలి మహిళా రైల్వేస్టేషన్

రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను అందరూ మహిళలే నిర్వహిస్తున్నారు. దేశంలో మహిళలు నిర్వహిస్తున్న తొలి మహిళా రైల్వే స్టేషన్‌ ఇదే. రైల్వే స్టేషన్‌ నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్‌) పరిధిలోని ఈ స్టేషన్‌లో ప్రతీ ఉద్యోగి మహిళే కావడం గమనార్హం.
దేశంలో ఇదే పూర్తిస్థాయి తొలి మహిళా రైల్వే స్టేషన్‌. స్టేషన్‌ సూపరింటిండెంట్‌, హెడ్‌ టికెట్‌ కలెక్టర్‌, పాయింట్‌ ఉమెన్‌, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌తో సహా మొత్తం 32 మంది మహిళలే నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్‌ మాస్టర్‌ ఏంజెలా స్టెల్లా మాట్లాడుతూ... ఏడాది రైల్వే సర్వీసులోనే ఈ స్థాయికి చేరుకుంటానని అనుకోలేదన్నారు.
స్టేషన్‌ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మొదటి రోజు విధిలో భాగంగా సిబ్బంది.. స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టిక్కెట్‌ లేకుండా తిరుగుతున్న ఒక వ్యక్తిని పట్టుకుని రూ.260 ఫైన్‌ విధించారు. ఎన్‌డబ్ల్యూఆర్‌ జనరల్‌ మేనేజర్‌ టి.పి.సింగ్‌ స్టేషన్‌ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
రోజుకు 7వేల మంది ప్రయాణించే ఈ రైల్వే స్టేషన్‌లో 25 రైళ్లు నిలుస్తాయి. కాగా, సబర్భన్‌ కేటగిరిలో ఇటీవలే ముంబయికి సమీపంలోని మాతుంగా స్టేషన్‌ అందరూ మహిళలు నిర్వహించిన స్టేషన్‌గా గుర్తింపు పొందినా.. గాంధీనగర్‌ మాత్రం మెయిన్‌ కేటగిరిలో తొలి స్టేషన్‌గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా దేశంలోని శానిటరీ నాప్కిన్స్‌ యంత్రాలున్న ఆరు రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి కావడం గమనార్హం.

Related Posts