యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నాదెళ్ల మనోహర్.. మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు కుమారుడిగా రాజకీయాలలోకి ప్రవేశించారు. గుంటూరు జిల్లా, తెనాలి నియోజవర్గానికి కాంగ్రెస్ తరపున 2004-2014 లో ఎమ్మెల్యే గా పనిచేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆయనే ఆఖరి స్పీకర్. అయన కాంగ్రెస్ లో ఉన్నంత కాలం పార్టీకి ఎన్నో సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రాలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయాక అయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
చాలా రోజులు తరువాత అయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో చేరి.. ఆ పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆంధ్ర లో తెలుగుదేశం, వైస్సార్సీపీ వంటి బలమైన స్థానిక పార్టీలు ఉండగా, ఒక అనుభవం ఉన్న నాయుడు కూడా లేని జనసేన పార్టీలోకి చేరారు. మరోవైపు ఆయనికి మేధావిగా, డీసెంట్ నాయకుడిగా మంచి పేరు ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని సంస్థాగతంగా నిర్మించే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు బాధ్యులను నియమించారు. అయితే వీరిలో అత్యధికులు మేధావి వర్గానికి చెందిన వారు కావడం విశేషం.పవన్ పక్కా మాస్ నటుడు, ఆయన పార్టీలో ఉన్న వారిలో ఇపుడు ఎక్కువమంది క్లాస్ పీపుల్ కనిపిస్తున్నారు. బాగా చదువుకున్న వారు, అవగాహన ఉన్న వారు, మహిళలను ఏరి కోరి పవన్ తన కమిటీల్లోకి తీసుకున్నారు.
మరి మనోహర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం తన రాజకీయ భవిష్యుత్ కు ఎంత వరకు దోహదపడుతుందో చూడాలి. అంతే కాకుండా జనసేనలో ఉన్నటువంటి క్లాస్ పీపుల్ ఎంతమంది జనంలోకి వెళ్ళి మెప్పు పొందుతారో కూడా చూడాలి.