Highlights
- ప్రపంచంలో అన్ని భాషలూ గొప్పవ
- అన్నింటికంటే మాతృభాష గొప్పది
- దానిని మనం గౌరవించాలి.
- రవీంద్రనాథ్ ఠాగోర్ ఏమంటారంటే
- "మాతృభాష అనేది అమ్మ పాలంత
- మధురమైనది ,పవిత్రమైనది.
- కాబట్టి ప్రతీ మనిషి తన మాతృభాష
- ను నేర్చుకోవాలి. "అంటారు.
శిశువు తొలిసారిగా తానొక భాషను నేర్చుకుంటున్నామనే జ్ఞానం కూడా లేనప్పుడు, తనలో ఉన్న అనుకరించడం అనే సహజ ప్రవృత్తి తో తన పరిసరాలలోని వారి భాషని
అనుకరిస్తూ, జీవితంలో తొలిసారిగా
నేర్చుకునే భాష "మాతృభాష".
శిశువు సౌందర్య దృష్టిని ,తన లోని
భావాలను,తనఆనందానుభూతిని
వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది
మాతృభాష అని గాంధీజీ అభిప్రాయ పడ్డారు.
మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు. ఐక్య రాజ్య సమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో ఈ రోజును 17 నవంబర్ 1999న తొలిసారి ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ కూడా ఈ విషయాన్నిధ్రువీకరించింది.
మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగామాండలికాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు ఆరువేలు. ప్రపంచీకరణ పుణ్యమా అని వీటిలో సగానికిసగం ప్రమాదంలో పడ్డాయి. భాషాశాస్త్రవేత్తల అంచనా ప్రకారం...గత మూడువందల సంవత్సరాల్లో ఒక్క అమెరికా, ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలుఅంతమైపోయాయి. వివిధ తెగల భాషలు కనుమరుగైపోయాయి. ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగానే యునెస్కో 'మాతృభాషల పరిరక్షణ అన్నది ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం' అని నిర్ధారించింది. 'కనీసం ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే' అంటూ హెచ్చరించింది. ఆ లెక్కన మన మాతృ భాష తెలుగు భాషకూ ప్రమాదం పొంచి ఉన్నట్టే!
బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ. ముందుగా వినిపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది 'అమ్మ...' అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మపాలెంత అవసరవో, వికాసానికి అమ్మభాషంత ముఖ్యం..,,
ఏ భాష అయినా మాతృభాష తర్వాతే.ఏ మాట అయినా తెలుగుమాట తర్వాతే.
శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటికే శాతవాహన చక్రవర్తి హాలుడు తన 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు ప్రయోగించాడు. ప్రపంచ కథానికల్లో వెుట్టవెుదటిది, గుణాఢ్యుడు రాసిన తెలుగు కథే. తెలుగు భాషలో ప్రతి ఉచ్చారణకీ ఓ ప్రత్యేకాక్షరం ఉంది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషాపదాన్నయినా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా ఉంది. అందుకే 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' అని ఆకాశానికెత్తేశారు హాల్డెన్ దొరగారు. 'సుందర తెనుంగై' అని తెగ మెచ్చుకున్నారు తమిళకవి సుబ్రహ్మణ్యభారతి. అప్పయ్యదీక్షితులైతే తెలుగువాడిగా పుట్టనందుకు జీవితాంతం చింతించారు. 'ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ... నాల్పస్య తపసఃఫలమ్' అంటూ తనకుతాను సర్దిచెప్పుకున్నారు. నిజమే మరి, తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు.
యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దదిగా మన్ననలందుకుంటున్నా. దేశం వెుత్తం మీద హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష మన తెలుగే! ఏ దేశమేగినా ఎన్ని భాషలు నేర్చుకున్నా అవన్నీ మాతృభాషకు ప్రత్యామ్నాయం కానేకావు. ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది.
మాతృ భాషలో విద్యాభోదన పిల్లకు మానిసిక వత్తిడి ఉండదు . మేలుచేస్తుందని మానసిక నిపునులు పదే పదే చెప్తున్నా మన సమాజము వినడం లేదు . ప్రపంచ ప్రజలతో అనుసంధానముకోసం ఇంగ్లిష్ నేర్చుకోవడం తప్పనిసరి అయినందున మన విద్యావిధానములో రెండేబాషలు ఉండి పాఠ్యాంశాలన్నీ తెలుగు (మాతృభాషలో)నే ఉండాలి. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ భాష గా మాత్రమే మొదటి నుండీ నేర్పడము ఉత్తమమైన విద్యావిధానము .
భారత రాజ్యాంగం గుర్తించిన ముఖ్యమైన నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు ఒకటి. మిగిలినవి తమిళం, కన్నడం, మలయాళం. భారతదేశంలో ద్రావిడ భాషలను మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికం. ఈ విషయంలో మొత్తం భారతదేశంలో హిందీ ప్రధమ స్థానం వహిస్తే తెలుగు రెండవ స్థానం పొందుతూంది. తెలుగు వారి సాహిత్యం అతి ప్రాచీనమైంది. రెండు వేల (2,000)సంవత్సరాల క్రితమే తెలుగు ఒక స్వతంత్ర భాషగా స్థిరపడిపోయింది. తెలుగు నుడికారము, మృదుమధుర భావగర్భితము, అత్యంత హృదయానందకము.
ప్రపంచ భాషలలో ఎట్టి శబ్దాన్నైనా తనలో జీర్ణించుకోగల సత్తా, ఏ శబ్దాన్నైనా ఉచ్చరింపజేయగల శక్తి అటు సంస్కృతానికీ ఇటు తెలుగుకు తప్ప మరే భాషకూ లేదు. ఇట్టి తెలుగు భాషకు నన్నయభట్టు మొదలుకొని ఎందరెందరో కవులు వ్యాకరణాలు రచించారు. ఇంకా రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు వ్యాకరణాలలో మొట్టమొదటిది 11వ శతాబ్దంలో వెలువడిన "ఆంధ్ర శబ్ద చింతామణి". .
"తల్లి నొడికంటే పరమామృతంబు కలదే" అని మహాకవి రాయప్రోలు వారన్నారు.
"మాతృ భాషా తృణీకారం అంటే మాతృదేవి తిరస్కారంతో సమానం" అని మహాత్మా గాంధీజీ అన్నారు.
దీన్నిబట్టి మాతృభాషకు ఉన్న ప్రాధాన్యం అర్ధం అవుతోంది.
మాతృమూర్తి పై ,మాతృభూమిపై ,
మనసున్న ప్రతి మనిషికీ అవ్యజమైన ప్రేమ,గౌరవం ఉంటుంది
అందుకే " మాతృ దేవోభవః " అని జన్మనిచ్చిన తల్లికి మన తొలి వందనం సమర్పించుకుంటాం.
తల్లి ఒడి తొలి బడి.
మనిషి జీవితంలో మొదట నేర్చుకున్నే భాష మాతృభాష.
జననీ జన్మభూమిస్య స్వర్గాదపీ గరీయసీ అన్నారంటే తల్లి, మాతృభూమి స్వర్గం కంటే మిన్న అని మనకు తేట తెల్లమవుతోంది.
మాతృభాష సహజంగా అబ్బుతుంది.అప్రయత్నంగా వచ్చే భాష మాతృభాష.
శిశువు తొలిసారిగా తానొక భాషను నేర్చుకుంటున్నామనే జ్ఞానం కూడా లేనప్పుడు, తనలో ఉన్న అనుకరించడం అనే సహజ ప్రవృత్తి తో తన పరిసరాలలోని వారి భాషని
అనుకరిస్తూ, జీవితంలో తొలిసారిగా
నేర్చుకునే భాష "మాతృభాష".
శిశువు సౌందర్య దృష్టిని ,తన లోని
భావాలను,తనఆనందానుభూతిని
వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది
మాతృభాష అని గాంధీజీ అభిప్రాయ పడ్డారు."దేశ భాష లందు లెస్స తెలుగు భాష అని చక్రవర్తి, సాహితీ సార్వభౌములు శ్రీ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథంలో తన ఇష్ట దైవమైన శ్రీ కాకుళాంధ్ర మహా విష్ణువుతో ఎంతో అందంగా చెప్పించారు.
ఏ భాషను శిశువు అసంకల్పితంగా మాట్లాడుతాడో ,ఏ భాష ఇతర భాషల అభ్యసనంపై ప్రభావం చూపుతుందో ఆ భాషనే మాతృభాషఅంటారు.
సాహిత్య వారసత్వ సంపదకు, జాతి మనుగడకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది.
అటువంటి మాతృభాషను అపురూపంగా చూసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సామాన్య ప్రజలు కూడా మాతృభాష లోనే భావ వ్యక్తీకరణ ద్వారానే ఒకరికొకరు దగ్గరవుతారనేది సత్యం .
రవీంద్రనాథ్ ఠాగోర్ ఏమంటారంటే
"మాతృభాష అనేది అమ్మ పాలంత
మధురమైనది ,పవిత్రమైనది.
కాబట్టి ప్రతీ మనిషి తన మాతృభాష
ను నేర్చుకోవాలి. "అంటారు.
మాతృభాష అంటే మనం అప్రయత్నంగా పెద్దల ద్వారా, మన చుట్టూ ఉండే సమాజం ద్వారా నేర్చుకొనేది. ఇంగ్లీషు భాష నేర్వటం అన్నది అవశరమూ, విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే కానీ మోజు కారాదు. ఈ మోజులో పడి మాతృభాష నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు.
సుసంపన్నమైన మన భాషాసాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం,మన భాషను,సంస్కృతినీ కాపాడుకోవడం ,భావి తరాల వారికి దీనిని అందించడం ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం మనఅందరి కర్తవ్యం.