యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ముఖ్యంగా పవిత్రమైన రోజులలో తిరుపతి స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతూ కిక్కిరిసి పోతుంది. ప్రతి రోజు సగటున 75,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.ఈస్టేషన్ ఎన్‌ఎన్‌జి -2 క్యాటగిరీ (ఇంతకు ముందు ఏయూ చెందిన స్టేషన్. రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో 50 భాగస్వామ్యంతో భారతీయ రైల్వేలోని 24 స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు మరింత అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రత్యేక పథకమిది. వాటిలో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఎంపిక చేయబడింది. అన్ని వర్గాల ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పించడానికి రైల్వే నడుం బిగించింది.రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన వసతులు, సదుపాయాలు కల్పిస్తుంది. అందులో భాగంగా కొన్ని 5 నక్షత్రాల స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దడానికి రూ.11 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక నూతనంగా ఏర్పాట్లు చేశారు.4, 5 ప్లాట్‌ఫారాలపై 1200 చదరపు మీటర్ల వైశాల్యంలో 210 సీట్ల సామర్థ్యం గల నూతన ఓపెన్ వెయిటింగ్ హాలు ఏర్పాటు, దీనిలో హైస్పీడ్ వై-ఫై, ఎల్‌ఈడి టీవీ సౌకర్యాలుంటాయి. ప్లాట్‌ఫారం నెంబర్ 1పై 100 చదరపు మీటర్ల విశాలమైన స్థలంలో అభివృద్ధి చేసిన క్లాక్ రూమ్ కూడా ఏర్పాటై ఇందులో ప్రయాణికులు తమ లగేజి భద్రపరుచుకోవడానికి 50 స్టీల్ ర్యాక్‌లు ఏర్పాటు చేశారు.ప్రస్తుత బుకింగ్ కార్యాలయాన్ని ప్రకటన వ్యవస్థ, సూచిక బోర్డులను అభివృద్ధి చేశారు. వీటికి అదనంగా ప్లాట్ ఫారం నెంబర్ 1పై సుమారు రూ.1.06 కోట్ల ఖర్చు చేసే అత్యున్నత ప్రమాణాలతో ప్రీమియం లాంజ్‌ని అభివృద్ధి చేయడం జరిగింది. 350 చదరపు మీటర్ల స్థలంలో రైలు వినియోగదారులకు ఆతిథ్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.