YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వివాదాల్లో యడ్యూరప్ప

వివాదాల్లో యడ్యూరప్ప

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తొందరపాటు ఆయన రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చే విధంగా మారింది. కర్ణాటకలో ఎప్పుడు అధికారంలోకి వద్దామా? అన్న ఆయన తొందర అనేక తొట్రుపాట్లకు గురిచేస్తోంది. ఆడియో టేపుల్లో తన స్వరం కాదని తొలుత బుకాయించిన యడ్యూరప్ప తర్వాత స్వరం మార్చి ఆ ఆడియో టేపుల్లో ఉన్న స్వరం తనదేనని, అయితే మాటలను కట్ చేసి పేస్ట్ చేశారని మరో కొత్త కథ అల్లారు. కర్ణాటక రాజకీయాలు ఇంతగా దిగజారాయనడానికి ఈ ఉదంతమే నిదర్శనం.నిజానికి యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించారు. అంతకు ముందే ఫలితాలు వెలువడిన అనంతరం మ్యాజిక్ ఫిగర్ కు పార్టీ చేరుకోకున్నా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆ తర్వాత సభలో బలం నిరూపించుకోలేక భంగపాటుకు గురయ్యారు. ఇది మర్చిపోకముందే నెల రోజుల క్రితం నుంచే ఎమ్మెల్యేలతో క్యాంపులను నిర్వహించి సంకీర్ణ సర్కార్ ను దించాలన్న ప్రయత్నం చేశారు.కాంగ్రెస్ నుంచి నలుగురు సభ్యులు తప్ప ఎవరూ బీజేపీ గూటికి చేరలేదు. నలుగురు కాంగ్రెస్ సభ్యులైన రమేష్ జార్ఖిహోళి, నాగేంద్ర, ఉమేష్ జాదవ్,మహేష్ కుమటహళ్లిలు చేరారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో సక్సెస్ అయిన యడ్యూరప్ప అక్కడి వరకే ఆగిపోయారు. ఆరుగురు సభ్యుల మద్దతు లభించడంతో మరో ఆరుగురి సభ్యుల మద్దతు కోసం మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు ప్రయత్నించి ఆడియో టేపుల్లో దొరికి భంగపడ్డారు. యడ్యూరప్ప వల వేసిన శాసనసభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి బేరసారాలను బయటపెడుతుండటం కూడా భారతీయ జనతా పార్టీ ఇరకాటంలో పడింది. కోలారు శాసనసభ్యుడు శ్రీనివాసగౌడ తనకు 30 కోట్ల రూపాయలు ఇస్తామని బేరసారాలు యడ్యూరప్ప ఆడారని ఆయన నేరుగా చెప్పడం విశేషం. తన ఇంట్లో ఐదు కోట్ల నగదు ఉన్న సూట్ కేసు వదిలి వెళ్లారని కూడా చెప్పారు. స్పీకర్ విషయంలోనూ ఇదే జరిగింది. మొత్తం మీద యడ్డీ తొందరపాటు చర్యల కారణంగా అడ్డంగా దొరికిపోయి ఇటు పార్టీతో పాటు తాను కూడా ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు మాత్రం యడ్డీని అడ్డుకోవడంలో ప్రస్తుతానికి సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Related Posts