యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఈ నెల 15న డీఎస్సీ 2018 మెరిట్ లిస్ట్ విడుదల అవుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు వుంటాయిన మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ రెండు వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. టెన్త్ పరీక్షలకు 6,21,623 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,838 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఏప్రిల్ 27న పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడుతాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలకు 10,17,600 మంది విద్యార్థులు అవుతారు. 1,430 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదల అవుతాయి. ఏప్రిల్ 19న ఏపీ ఈసెట్, మే 30న ఫలితాలు, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఏపీ ఎంసెట్, మే 1న ఫలితాలు, ఏప్రిల్ 26న ఏపీ ఐసెట్, మే 3న ఫలితాలు, మే 1 నుంచి 4 వరకు ఏపీ పీజీసెట్, మే 11న ఫలితాలు, మే ఆరున ఏపీ ఎడ్ సెట్, మే 10న ఫలితాలు, మే ఆరున ఏపీ లా సెట్, మే 13న ఫలితాలు, మే 6-15 వరకు ఏపీ పీఈ సెట్, మే 25న ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.