సూపర్‌స్టార్ కమల్‌హాసన్ తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు. ఫిబ్రవరి 21న ఆయన తన పార్టీ వివరాలను వెల్లడించనున్నారు. తమిళనాడులోని రామనాథపురంలో ఈ విషయాన్ని ఆయన ప్రకటించనున్నారు. ఆ తర్వాత అదే రోజున రాష్ట్రవ్యాప్త పర్యటనకు కమల్ శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్త టూర్‌ను పలు దశల్లో నిర్వహించనున్నారు. తన సొంత పట్టణం రామనాథ్‌పురం నుంచి స్టేట్ టూర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మధురై, దిండిగుల్, శివగంగాయి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ టూర్‌తో కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం అఫిషియల్‌గా మారుతుంది. దాదాపు ఏడాది నుంచి కమల్ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్త పర్యటన సందర్భంగా తన రాజకీయ పార్టీ పేరును వెల్లడించనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాజకీయాలను మార్చేస్తానన్నారు.