యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి కలిసి వినతి పత్రం అందజేసారు. రాష్ట్ర విభజన హామీల గురించి చంద్రబాబు రాష్ట్రపతితో చర్చిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. తమ వినితి పత్రంలో 18 డిమాండ్లు వున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోవింద్ ను కోరామని చెప్పారు. విభజన హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో మోదీ చెప్పిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రధాని మోదీకి నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మోదీకి లేదని అన్నారు. ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తానికి తెలియజేశామని చెప్పారు.