YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో 98 కాంగ్రెస్ అభ్యర్థులు దరఖాస్తులు

కర్నూలులో 98 కాంగ్రెస్ అభ్యర్థులు దరఖాస్తులు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. జిల్లాలోని పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేందుకు దాదాపుగా 89 దరఖాస్తులు జిల్లా కాంగ్రెస్‌ కమిటీకి అందాయి. ఈ దరఖాస్తులన్నింటిని పిసిసి రాష్ట్ర కేంద్రం పరిశీలన చేసిన అనంతరం అభ్యర్థులను ప్రకటించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్‌ పార్టీలోని అనేకమంది నేతలు టిడిపి, వైసిపిలలో చేరి పోటీ చేశారు. కర్నూలు జిల్లాలో కూడా అనేకమంది కాంగ్రెస్‌ నేతలు టిడిపి, వైసిపిలలో చేరారు. అయితే కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం మాత్రం కాంగ్రెస్‌ను వీడకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలిచింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో ఇప్పుడు కేంద్రమాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి త్వరలోనే అధికార టిడిపిలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డిరాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరి ఇప్పుడు తనదైన స్థాయిలో వ్యూహరచన చేస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్‌ నుంచి బరిలో నిలవాలని నిర్ణయించకున్నట్లు తెలిసింది. అయితే కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి మాత్రం పోటీ చేసేందుకు ఆపార్టీ మైనార్టీ సెల్‌ చైర్మన్‌ అహ్మద్‌ అలీఖాన్‌ను బరిలో దింపేందుకు అదిష్టానం చూస్తున్నట్లు తెలిసింది. మరో పక్క జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనేక మంది అభ్యర్థులు ముందుకొచ్చారు. ఈ అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను పిసిసికి పంపుతున్నారు. పిసిసి కూడా అభ్యర్థుల వివరాలను పునర్‌ పరిశీలన చేసి ఎఐసిసి నుంచి ఆమోద ముద్ర పడగానే అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Related Posts