YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కీశోర్ చంద్రదేవ్ కు లైన్ క్లియర్ అయినట్టే

కీశోర్ చంద్రదేవ్ కు లైన్ క్లియర్ అయినట్టే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు. ఆయన కోసం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమ పార్టీలోకి తీసుకువచ్చి ఆయనను పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో పసుపు పార్టీ పెద్దలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన వస్తే గెలుపు గ్యారంటీ అన్న లక్ష్యంతో ఆయన రాకకోసం పడిగాపులు కాస్తున్నారు పసుపు పార్టీ నేతలు. ఆయనే మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్. అరకు ఎంపీగా గతంలో ఉన్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. భారతీయ జనతా పార్టీపై కూడా విమర్శలు చేయడంతో ఆయన బీజేపీకి దగ్గర కారని స్పష్టమైంది. దీంతో ప్రాంతీయ పార్టీల వైపే ఆయన మొగ్గు చూపే అవకాశముంది. కిశోర్ చంద్రదేవ్ కు ఉత్తరాంధ్ర లోని ఏజెన్సీ ప్రాంతంలో బలమైన క్యాడర్ తో పాటు పట్టుంది. దాదాపు ముప్ఫయి ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన కురుపాం రాజకుటుంబానికి చెందిన నేత. గతంలో పార్వతీ పురం ఎంపీగా గెలిచి, తర్వాత అరకు పార్లమెంటుకు మారారు. ఐదుసార్లు పార్లమెంటుకు, ఒకసారి రాజ్యసభకు కిశోర్ చంద్రదేవ్ ఎన్నికయ్యారు.2014లో అరకు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్న చర్చ ఉత్తరాంధ్ర జిల్లాల్లో జోరుగా సాగుతోంది. మిస్టర్ క్లీన్ కావడం, ముక్కు సూటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కావడంతో కిశోర్ చంద్రదేవ్ కోసం అన్ని పార్టీల నేతలు గాలం వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకేసి కిశోర్ చంద్రదేవ్ కోసం నేతలను మొహరించిందనే చెప్పాలి. ఆయన వస్తే అరకు పార్లమెంటు పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోందిఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పాడేరు, అరకు నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీని దెబ్బకొట్టేందుకు కిశోర్ చంద్రదేవ్ ను రప్పించాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా ఉంది. ఇప్పుడు అరకు, పాడేరు నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి రావడంతో టీడీపీ బలంగా ఉందంటున్నారు. అయితే గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా కిశోర్ చంద్రదేవ్ గతంలో పోరాడారు. అయితే టీడీపీ మాత్రం తాము బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమంటూనే తవ్వకాలకు జీవో నెంబరు 010 విడుదల చేసింది. అరకు పార్లమెంటుకు పోటీ చేసే సమర్థవంతమైన నేత టీడీపీలో లేకపోవడంతో కిశోర్ చంద్రదేవ్ కోసం టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు టీడీపీ నేతల ప్రయత్నాలు ఫలించాయి. కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో త్వరలో చేరనున్నట్లు ప్రకటించారు.

Related Posts