Highlights
- ఇరువై ఏళ్ళ సర్వీస్
చాలా గొప్ప పేరుగల స్వామీజీ ఉన్నారు .
ఎప్పుడూ చెరగని చిరునవ్వు మొహం ధ్యానం . సాధన ఓపిక స్వామీజీకి చాలా ఎక్కువ.
శిష్యులు ఎలాంటి తిక్కప్రశ్నలు వేసినా విసుగు, కోపం లేకుండా చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు . . స్వామీజీ ఓపిక ధైర్యం చాలా పెద్దప్రచారంలో ఉన్నది.
ఇది తెలిసి ఒక ఫేమస్ న్యూస్ పేపర్ విలేకరి ఇంటర్వూ తీసుకోవడం కొరకు స్వామిజీని కలిశాడు.
విలేకరి : స్వామిజీ మీ గురువు ఎవరు ? ఇంత ధైర్యం , ధ్యానం , ఓపిక , సాధన , ఎవరిదగ్గర నేర్చుకున్నరూ ?
స్వామిజీ విలేకరి వైపు చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ ఊపిరి
వదులుతూ చెప్పారు .
.బిడ్డా.. నేను ఇరువై ఏళ్ళు ఒక చీరల షోరూమ్ లో పని చేశాను